విచారణ అవసరం లేదు : ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్

సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణ అవసరం లేదని చెప్పింది.

Updated on: Jan 5, 2026, 12:17:28 IST
By , Delhi
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హరీష్‌ను ప్రతివాదిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేసింది. అయితే ఈ సందర్భంగా హరీష్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. విచారణ అవసరం లేదని చెప్పింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా జస్టి్స్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించారు.

మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ డిసెంబర్ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హరీష్ రావు, ఆయన వ్యక్తిగత సహాయకుడు వంశీ కృష్ణ, అనేక మందిపై కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ రావు హైకోర్టు వెళ్లారు. తనపై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని, ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు.

హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ హైకోర్టు మార్చి 2025లో తీర్పు ఇచ్చింది. తరువాత చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కానీ హైకోర్టు తన నిర్ణయాన్ని రద్దు చేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది.

హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు క్వాష్ చేయగా.. అందులో జోక్యం చేసుకోలేమని, విచారణ అవసరం లేదని పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More