తెలంగాణలో కొత్తగా సామాజిక పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది అర్హులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దసరా పండుగ నుంచే కొత్త పింఛన్లను అందజేస్తామని గతంలో ప్రకటన వచ్చినప్పటికీ సాంకేతిక, పరిశీలన కారణాల వల్ల పంపిణీ వాయిదా పడింది. అయితే ఈ ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు పూర్తి చేసిన అధికారులు, కొత్తగా అర్హులైన వారికి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభించేందుకు తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తికానున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఈ కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ముహూర్తాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేయూత పింఛన్ల కోసం మొత్తం 5.95 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించిన అధికారులు, ప్రాధాన్యతా క్రమంలో 4.6 లక్షల మందిని అర్హులుగా తేల్చారు.
వితంతువులు: 2.50 లక్షల మంది, దివ్యాంగులు: 1.00 లక్షకు పైగా, ఒంటరి మహిళలు: 50,000 మంది, గీత కార్మికులు : 30,000 మంది, చేనేత కార్మికులు : 7,000 మంది.. ఇలా మెుత్తం 4 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన సందర్భంగా కొందరు కొత్త లబ్ధిదారులకు ప్రతీకాత్మకంగా పంపిణీ పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. మిగిలిన అర్హులందరికీ దశలవారీగా డిసెంబర్ నుంచి మంజూరు పత్రాలు అందించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లను పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 4,016, మిగిలినవారికి రూ. 2,016 అందిస్తున్నారు. ఈ సామాజిక భద్రతా పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఏటా దాదాపు రూ. 10,000 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా 4.6 లక్షల మంది చేరడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనున్నప్పటికీ, ఇచ్చిన హామీ మేరకు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది.
కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో సరిచూసుకోవాలి. స్థానిక పంచాయతీ ద్వారా మీ దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. అయితే ప్రభుత్వం కొత్తగా 2.5 లక్షల పింఛన్లను ఇవ్వాలని చూస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. క్షేత్రస్థాయిలో అధికారులు చాలా జాగ్రత్తంగా పరిశీలిస్తున్నారు. అర్హులైనవారిని గుర్తించే వెంటనే అప్లికేషన్ పక్కన పెట్టేస్తున్నారు. అన్నీ కుదిరితే డిసెంబర్ నుంచి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది.
{{/usCountry}}కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో సరిచూసుకోవాలి. స్థానిక పంచాయతీ ద్వారా మీ దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. అయితే ప్రభుత్వం కొత్తగా 2.5 లక్షల పింఛన్లను ఇవ్వాలని చూస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. క్షేత్రస్థాయిలో అధికారులు చాలా జాగ్రత్తంగా పరిశీలిస్తున్నారు. అర్హులైనవారిని గుర్తించే వెంటనే అప్లికేషన్ పక్కన పెట్టేస్తున్నారు. అన్నీ కుదిరితే డిసెంబర్ నుంచి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది.
{{/usCountry}}