పాలమూరు రైతాంగ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె… పాలమూరు ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించకూడదని హితవు పలికారు.

"ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి గారూ! పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే మీరు ఈ స్థాయికి చేరుకున్నారనే నిజాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు," అని డీకే అరుణ హెచ్చరించారు. పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని, సొంత ప్రాంత రైతాంగానికే అన్యాయం చేసేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు.
సుమారు 60 కిలోమీటర్ల మేర విస్తరించి, 30 గ్రామాలను తీవ్ర ముంపునకు గురిచేసే ప్రమాదకర డిండి లిఫ్ట్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2016లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత రావడంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టు పనులను ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టి పాలమూరు ప్రజల కడుపు కొట్టాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు.
జిల్లాల మధ్య చిచ్చు పెట్టొద్దు…
శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి డిండి వైపు తరలించే ప్రతి నీటి బొట్టు ముమ్మాటికీ పాలమూరు రైతాంగానికే చెందాలని డీకే అరుణ స్పష్టం చేశారు. నల్గొండకు తరలించాలనుకుంటున్న 0.6 టీఎంసీల నీటిని కూడా తమ పాలమూరు జిల్లా రైతులకే కేటాయించాలని కోరారు.
నల్గొండ జిల్లాకు నీరందించడానికి ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్, నక్కలగండి, మల్లన్న సాగర్ ద్వారా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు రెండు జిల్లాల రైతుల మధ్య అనవసరంగా చిచ్చు పెట్టే కుట్రలు ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
{{/usCountry}}నల్గొండ జిల్లాకు నీరందించడానికి ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్, నక్కలగండి, మల్లన్న సాగర్ ద్వారా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు రెండు జిల్లాల రైతుల మధ్య అనవసరంగా చిచ్చు పెట్టే కుట్రలు ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
{{/usCountry}}ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను మంత్రిగా పనిచేసిన సమయంలో పాలమూరులో ప్రతి ఎకరాకూ నీరందించాలనే స్పష్టమైన సంకల్పంతో జీవో 72 తీసుకువచ్చినట్లు డీకే అరుణ తెలిపారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం జీవో 105 తీసుకువచ్చి, ప్రాజెక్టు అప్రోచ్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి జిల్లాకు తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా జిల్లాలో ఒక్క ఎకరాకైనా అదనంగా నీరిచ్చారా అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న స్థానిక మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థంతో మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు.
ఎంపీ అరుణ ప్రస్తావించిన అంశాలు - డిమాండ్లు :
- పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి డీపీఆర్‌ను వెంటనే సమీక్షించి, గతంలో అనుకున్నట్లుగా జూరాల నుంచే నీటిని ఎత్తిపోసేలా తుది నిర్ణయం తీసుకోవాలి.
- 10.5 టీఎంసీల కేటాయింపులు ఉన్న భీమా/ఆర్డీఎస్ (రాజోలి బండ మళ్లింపు పథకం) ఆయకట్టుకు తక్షణమే పునర్నిర్మాణ, మరమ్మతు పనులు చేపట్టాలి.
- జూరాల ప్రాజెక్టు మరమ్మతులు, బలోపేతం మరియు బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం యుద్ధప్రాతిపదికన నిధులు కేటాయించి పూర్తి చేయాలి.
- డిండి లిఫ్ట్ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయబోతున్నట్లు డీకే అరుణ వెల్లడించారు. పాలమూరు గడ్డ నీటి హక్కుల కోసం, తమ ప్రాంత రైతుల భవిష్యత్తు కోసం డిండి లిఫ్ట్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగేది లేదని ఆమె స్పష్టం చేశారు.