...
...
Next Story

Somasila Krishna River : సోమశిలకు వచ్చే టూరిస్టులకు గుడ్ న్యూస్ - బోటింగ్ సేవలు పునఃప్రారంభం

Somasila Krishna River : కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరడంతో నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిలలో బోటింగ్ సేవలను అధికారులు ఆదివారం పునఃప్రారంభించారు. పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని సూచించారు.

Published on: Aug 10, 2026, 09:09:42 IST
Advertisement

Somasila Krishna River : కృష్ణానది తీరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో పర్యాటకులకు మళ్లీ విహార వేడుక అందుబాటులోకి వచ్చింది. ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేయడంతో, ఇక్కడ కృష్ణానదిలో నీటి మట్టం స్థిరంగా మారింది. దీంతో గత కొంతకాలంగా నిలిచిపోయిన బోటింగ్ సేవలను ఆదివారం నుంచి అధికారులు అధికారికంగా పునఃప్రారంభించారు.

వరద నీటి రాకతో….

సోమశిల (ఫైల్ ఫొటో)
సోమశిల (ఫైల్ ఫొటో)

వేసవి కాలంలో కృష్ణానదిలో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటక శాఖ బోటింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద జలాలు వచ్చి చేరాయి. నదిలో నీటి లభ్యత పుష్కలంగా పెరగడంతో సోమశిల వద్ద మళ్లీ బోటింగ్ నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటక శాఖ అధికారులు తక్షణమే స్పందించి బోట్లను నీటిలోకి దించారు.

ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన కృష్ణానది ప్రవాహం మధ్య బోటింగ్ చేయడం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే నదిలో విహరించే సమయంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బోటింగ్ చేసే ప్రతి ఒక్క పర్యాటకుడు విధిగా, తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని, సిబ్బంది ఇచ్చే భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని టూరిజం అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు సోమశిల వద్ద దాదాపు 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇక్కడ వాటర్‌ఫ్రంట్ టూరిజం, లగ్జరీ హోటళ్లు, వినోద వేదికలు, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు, ఆధునిక పర్యాటక మౌలిక వసతులను కల్పించి భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించనున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe