BRAOU MCA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో MCA ప్రవేశాలు - దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

BRAOU MCA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ MCA ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 28 వరకు అవకాశం ఉంది. 

Published on: Sep 19, 2026, 13:54:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRAOU MCA Admissions 2026 : హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ప్రవేశ పరీక్ష (BRAOUMCAET-2026) కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఎంసీఏ ప్రవేశాలు
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఎంసీఏ ప్రవేశాలు

ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్లు అయిన www.braou.ac.in లేదా www.braouonline.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు

  • ఓపెన్ కేటగిరీఅభ్యర్థులకు దరఖాస్తు ఫీజు: రూ. 1,500
  • ఎస్సీ (SC), ఎస్టీ (ST), బిసి (BC), మరియు దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు: రూ. 1,000

అభ్యర్థులు ఈ ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా తెలంగాణ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చు. సెప్టెంబర్ 28, 2026 లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ వివరాలు

ఎంసీఏ ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్ (రాత పరీక్ష) విధానంలో నిర్వహిస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రశ్నపత్రాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో రూపొందిస్తారు.

  • పరీక్ష తేదీ: అక్టోబర్ 04, 2026
  • సమయం: ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు (1 గంట 30 నిమిషాలు)

కోర్సు ప్రవేశాలు, అర్హతలు ఇతర సమగ్ర సమాచారం కోసం వర్సిటీ కాల్ సెంటర్ నంబర్ 18005990101 లేదా హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680222 / 333 / 444 / 555 లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More