రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నా.. కొందరు అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలంలో భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారిణి పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది.

నాలా(NALA) కన్వర్షన్ కోసం రూ. 30 లక్షల లంచం డిమాండ్ చేస్తూ.. ఓ లంచగొండి తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. మే 26, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో రంగారెడ్డి రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడిలో ఈ బాగోతం వెలుగుచూసింది.
రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ టి. సుచరిత ఒక భూమి వ్యవహారంలో భారీగా లంచం డిమాండ్ చేశారు. సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూమిని నాలా (NALA - Non-Agricultural Lands Assessment Act) కింద కన్వర్షన్ చేసేందుకుగానూ ఆమె బాధితుడి నుండి ఏకంగా రూ. 30 లక్షల లంచం డిమాండ్ చేశారు.
డ్రైవర్ ద్వారా డీల్
మొత్తం లంచం డబ్బులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షలు ఇవ్వాలని తహసీల్దార్ సుచరిత చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఆదేశాల మేరకు ఆమె ప్రైవేట్ డ్రైవర్ వి.నాగేష్ బాధితుడి నుండి ఆ రెండు లక్షల రూపాయలను తీసుకుంటుండగా, ముందే వ్యూహాత్మకంగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రైవర్‌తోపాటు తహసీల్దార్ సుచరితను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం, ఆమె నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల మరో ఏసీబీ దాడి
తెలంగాణలో రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి తిమింగలాలు వరుసగా ఏసీబీకి చిక్కుతున్నాయి. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే హైదరాబాద్ శివార్లలోని కబ్జాకు గురైన భూమిని సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించడానికి ఓ సర్వేయర్, మరో అధికారి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నాలా కన్వర్షన్లు, మ్యుటేషన్ల కోసం రైతులు, రియల్టర్లను అధికారులు ఇలా పీడించుకుతింటున్నారనే దానికి ఈ వరుస ఘటనలే నిదర్శనం.
ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి
{{/usCountry}}తెలంగాణలో రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి తిమింగలాలు వరుసగా ఏసీబీకి చిక్కుతున్నాయి. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే హైదరాబాద్ శివార్లలోని కబ్జాకు గురైన భూమిని సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించడానికి ఓ సర్వేయర్, మరో అధికారి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నాలా కన్వర్షన్లు, మ్యుటేషన్ల కోసం రైతులు, రియల్టర్లను అధికారులు ఇలా పీడించుకుతింటున్నారనే దానికి ఈ వరుస ఘటనలే నిదర్శనం.
ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి
{{/usCountry}}ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు కోరారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమేనని గుర్తుచేశారు.