తెలంగాణ రాజకీయం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వివాదంతో తీవ్ర వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 1 లక్ష కేపిటల్ ఉన్న ఒక షెల్ కంపెనీకి కట్టబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ వ్యవహారాన్ని తొలుత బయటపెట్టగా కేటీఆర్ విలేకరుల సమావేశంలో దీనిపై ఆధారాలను బయటపెట్టారు. పటాన్‌చెరులోని ఒక చిన్న ఇంటి చిరునామాతో నమోదైన 'టెస్సెరాక్ట్' సంస్థకు ఒక్క ఉద్యోగి కూడా లేరని కేటీఆర్ అన్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్‌గా 12345678 అని పొందుపరచడం ఈ సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు.
రూ. 200 కోట్ల విలువైన భూకేటాయింపులను ప్రారంభ మూలధనం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉన్న అనామక సంస్థకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇది ఐదు ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డికి ఈ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కొండల్ రెడ్డి స్వయంగా తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారని ఆధారాలు చూపించారు.
అంతేకాకుండా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెస్సెరాక్ట్ చైర్మన్‌గా కొండల్ రెడ్డికి లభించిన ఆహ్వానాలు, వీరి ఏరోస్పేస్ కంపెనీ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ హాజరు కావడం వంటి విషయాలను కేటీఆర్ ప్రస్తావించారు.
సొంత శాఖలో జరుగుతున్న అక్రమాలపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కనీస అవగాహన ఉందా అని కేటీఆర్ నిలదీశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను గుడ్డిగా చదవడం మాని, కొండల్ రెడ్డి బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్న వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు.
{{/usCountry}}సొంత శాఖలో జరుగుతున్న అక్రమాలపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కనీస అవగాహన ఉందా అని కేటీఆర్ నిలదీశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను గుడ్డిగా చదవడం మాని, కొండల్ రెడ్డి బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్న వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు.
{{/usCountry}}గతంలో రేవంత్ రెడ్డి సోదరులు, బావమరిది కంపెనీలకు అమృత్ పథకంలో కాంట్రాక్టులు ఇచ్చారనే విమర్శలు ఉండగా, ఇప్పుడు టెస్సెరాక్ట్ పేరుతో కొత్త భూముల కేటాయింపు స్కామ్ బయటపడటం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ భూకేటాయింపుపై పారదర్శకమైన విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.