...
...
Next Story

Delimitation Bill : డీలిమిటేషన్‌ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు.. క్లారిటీతో ఉన్నామని చెప్పిన కేటీఆర్

Delimitation Bill : నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటువేస్తారని వెల్లడించారు.

Published on: Nov 28, 2026, 15:10:03 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) బిల్లుపై భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. పార్లమెంటులో ఈ బిల్లుపై జరిగే ఓటింగ్‌లో తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

కేటీఆర్
కేటీఆర్

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం కలగకూడదన్నదే తమ పార్టీ ప్రధాన డిమాండ్‌ అని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని గతంలో పలు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుత బిల్లులోని ప్రతిపాదనలు ఆ అపోహలను తొలగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

2051వ సంవత్సరం వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిలో ఎలాంటి మార్పులు లేకుండా రక్షణ కల్పించాలన్న తమ విజ్ఞప్తికి అనుగుణంగా అడుగులు పడటం సానుకూల పరిణామమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలను 50 శాతం మేర పెంచాలన్న ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు.

ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియ అమల్లోకి వస్తే తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో గణనీయమైన మార్పు రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, కొత్త బిల్లు ప్రకారం ఆ సంఖ్య 26కు పెరుగుతుందని కేటీఆర్‌ వివరించారు. అంటే తెలంగాణకు అదనంగా 9 ఎంపీ స్థానాలు దక్కనున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఆలోచించి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు ఏ రూపంలోనైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks