కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఒక రోజు తర్వాత న్యూఢిల్లీ నుండి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. రాష్ట్రాల వారీగా కేటాయింపులు, కీలక రైల్వే ప్రాజెక్టులను వివరించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్‌లను ప్రధాన గేమ్ ఛేంజర్‌లుగా వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ 2026-27ను కర్ణాటకకు రికార్డ్ బడ్జెట్‌గా అభివర్ణించారు. రూ.7,748 కోట్ల రైల్వే కేటాయింపులు, రాష్ట్రంలో రూ.52,950 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు.

బడ్జెట్‌లో ప్రకటించిన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో అంతర్ నగర ప్రయాణాన్ని గణనీయంగా మారుస్తాయని వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను డైమండ్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఈ బడ్జెట్‌లో కర్ణాటకకు బుల్లెట్ రైలు ప్రతిపాదనలు అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటిగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై కారిడార్ ప్రయాణ సమయాన్ని కేవలం ఒక గంట 13 నిమిషాలకు తగ్గిస్తుందని అన్నారు. 'బెంగళూరు-చెన్నై ఒక విధంగా రెండు విలీన నగరాలుగా మారతాయి. రోజులో ఏ సమయంలోనైనా వెళ్లి రావొచ్చు. చెన్నైలో పని పూర్తి చేసి అదే రోజు బెంగళూరుకు తిరిగి రావచ్చు. అదేవిధంగా బెంగళూరు-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు మార్గం ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలు మాత్రమే అవుతుంది.' అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
వేగవంతమైన కనెక్టివిటీతో తయారీ, డిజైన్, ఐటీ సేవలకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా బెంగళూరు పాత్రకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్‌లను ప్రతిపాదించారు. వీటిలో, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు కారిడార్లు, బెంగళూరును తెలంగాణ, తమిళనాడు రాజధానులతో నేరుగా కనెక్ట్ చేస్తాయని భావిస్తున్నారు. ఇతర ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు మార్గాలలో ముంబై-పుణే, పూణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి ఉన్నాయి.
{{/usCountry}}కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్‌లను ప్రతిపాదించారు. వీటిలో, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు కారిడార్లు, బెంగళూరును తెలంగాణ, తమిళనాడు రాజధానులతో నేరుగా కనెక్ట్ చేస్తాయని భావిస్తున్నారు. ఇతర ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు మార్గాలలో ముంబై-పుణే, పూణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి ఉన్నాయి.
{{/usCountry}}