...
...
Next Story

నిజాంల నాటి చెరువుకు ప్రాణం పోసిన 'హైడ్రా' - జనవరిలో ప్రారంభానికి స‌న్నాహాలు..!

నిజాంల నాటి బమ్-రుక్న్-ఉద్-దౌలాకు హైడ్రా చెరువు ప్రాణం పోసింది. జ‌న‌వ‌రిలో ఈ చెరువును ప్రారంభించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం ఈ చెరువు దగ్గర జరుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్ పరిశీలించారు.

Published on: Dec 20, 2025 03:59 PM IST
Advertisement

పాత‌బ‌స్తీలో నిజాంల నాటి చారిత్ర‌క చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. క‌బ్జాల‌ను తొల‌గించి ఊపిరిలూదింది. ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్లే కోల్పోయిన చెరువును బ‌తికించింది. చరిత్ర‌ను త‌వ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్ర‌క వైభ‌వాన్ని హైడ్రా చాటింది. ఇలా పాత‌బ‌స్తీకే మ‌ణిహారంగా బమ్ -రుక్న్-ఉద్-దౌలా చెరువును స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతోంది.

బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు ప్రారంభానికి స‌న్నాహం
బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు ప్రారంభానికి స‌న్నాహం

జ‌న‌వ‌రిలో ఈ చెరువును ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శ‌నివారం బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు అభివృద్ధి ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింద‌నుకున్న చ‌రిత్ర‌కు ప్రాణం పోస్తున్నాం.. ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారుల‌ను ఆదేశించారు.

చెరువుకు స్థానికులు సుల‌భంగా చేరుకునేలా ర‌హ‌దారుల‌తో పాటు ప్ర‌వేశ ద్వారాలుండాల‌ని సూచించారు. చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్‌ ట్రాక్‌లను ప‌రిశీలించారు. చెరువు లోప‌లి వైపు ఫెన్సింగ్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ప్లే ఏరియాలను ప‌రిశీలించారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్క‌డ గ‌జ‌బోలు నిర్మాణాలు న‌లువైపులా ఉండేలా చూడాల‌న్నారు. పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

విహార కేంద్రంగా తీర్చిదిద్దాలి - హైడ్రా కమిషనర్

కాంక్రీట్ జంగిల్‌గా న‌గ‌రాలు మారిపోతున్న వేళ‌.. పాత‌బ‌స్తీలో నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీకి చేరువ‌లో అభివృద్ధి చేస్తున్న బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు విహార కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ తీర్చిదిద్దాల‌న్నారు. ఔష‌ధ గుణాలున్న వృక్ష జాతితో పాటు.. మొక్క‌ల‌ను చెరువు చుట్టూ నాటాల‌ని సూచించారు. ప‌చ్చిక బైళ్ల‌తో పార్కులు ఆహ్లాద‌క‌రంగా తీర్చిదిద్దాల‌న్నారు.

రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్‌, కాటేదాన్ ప్రాంతాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద ఈ చెరువుకు చేరేద‌ని చెబుతున్నారు. నిజాంల‌ కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును రాణులు స్నానాల‌కు వినియోగించేవార‌ని చెబుతున్నారు. అలాగే బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువులో వ‌న‌మూలిక‌ల చెట్లు, కొమ్మ‌లు వేసి…. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వ‌చ్చిన ఊట నీటిని తాగేందుకు నిజాం పాల‌కులు వినియోగించేవార‌ని మ‌రికొంత‌ మంది వివ‌రిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe