దంతేరాస్‌కు ఏపీ, తెలంగాణలో బంగారం కొంటున్నారా? గోల్డ్ షాపింగ్ గైడ్
Gold Shopping Guide : దంతేరాస్‌కు ఏపీ, తెలంగాణలోనూ బంగారం కొనేవారు చాలా మందే ఉంటారు. బంగారం కొనుక్కోవడం మంచిదే. కానీ షాపింగ్ చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
దంతేరాస్‌కు బంగారం, వెండి లేదా వజ్రాభరణాలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చిన్న లక్ష్మీదేవి బంగారు నాణెం కొన్నా.. ఇంట ఐశ్వర్యం తులతూగుతుందని విశ్వసిస్తారు. అయితే పండుగ వేళ కస్టమర్ల రద్దీ, వ్యాపారుల ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్ల మాయలో పడి మోసపోకుండా ఉండాలంటే కొనుగోలుదారులు పలు కీలక అంశాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, డైమండ్, వెండి ఆభరణాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హిడెన్ ఛార్జీల వెనక ఉన్న నిజాలను లెక్కలు వేసుకోవాలి.

రోజూ ధరించే బంగారు ఆభరణాలకు 22 క్యారెట్ల 916 బీఐఎస్ హాల్‌మార్క్ పసిడి సరైన ఎంపిక. దీనిలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. తయారీ ఆధారంగా తరుగు, ఇతర ఛార్జీలు ఉంటాయి.
సాధారణంగా వజ్రాభరణాలు లేదా రత్నాలు పొదిగిన నగలలో 18 క్యారెట్ల (75.0 శాతం స్వచ్ఛత) బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇవి తక్కువ బరువుతో, తక్కువ ధరలోనే ఎక్కువ పరిమాణంలో డిజైనర్ లుక్ ఇస్తాయి.
ఆభరణాలు చేయడానికి 24 క్యారెట్ల బంగారం పనికిరాదు. నాణేలు, బిస్కెట్లు కొనుగోలు చేసేవారు మాత్రమే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడిని ఎంచుకోవాలి. మీరు కొనే ప్రతి బంగారు వస్తువుపై 6 అక్షరాలు/అంకెలతో కూడిన HUID నంబర్ ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయండి. 'BIS CARE App' ద్వారా HUID నంబర్ నమోదు చేసి ఆభరణం స్వచ్ఛతను నిమిషాల్లో ధృవీకరించుకోవచ్చు.
వజ్రాభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కేవలం డిజైన్ మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ఆమోదించిన 4సీ సూత్రాన్ని పరిశీలించాలి. అవి : కట్ అంటే వజ్రం చెక్కడపు నాణ్యత, దాని మెరుపు. కలర్ అనగా.. రంగు చూడడం, క్లారిటీ అంటే లోపాలు లేదా మచ్చలు లేకపోవడం. మరో సీ అంటే క్యారెట్ బరువు వివరాలు చూసుకోవాలి. వీటితో పాటు సదరు వజ్రానికి జీఐఏ, ఐజీఐ వంటి అంతర్జాతీయ సంస్థల సర్టిఫికేషన్ ఉందో లేదో సరిచూసుకోవడం తప్పనిసరి.
పండుగల వేళ జ్యువెలరీ షాపులు ఇచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని దుకాణాలు 24 క్యారెట్ల ధరకు 22 క్యారెట్ల నగలు ఇస్తామని ప్రకటనలు గుప్పిస్తుంటాయి. ఇలాంటి ఆఫర్ల వల్ల మీకు నిజంగా ఎంత మేర లబ్ధి చేకూరుతుందో మేకింగ్, వీఏ ఛార్జీలతో కలిపి లెక్కలేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. హాండ్ మేడ్, మిషన్ మేడ్ డిజైన్‌ను బట్టి తరుగు, మజూరీ మారుతుంటాయి. బోర్డులపై తక్కువ వీఏ అని ప్రచారం చేసినా ప్రాక్టికల్‌గా లెక్కలు వేరే ఉంటాయి మరి జాగ్రత్త. కొందరు జీఎస్టీ లేదు అంటూనే.. ఆ మొత్తాన్ని మేకింగ్ ఛార్జీలు లేదా వేస్టేజీ రూపంలో వేరే విధంగా కస్టమర్ల నెత్తిపైనే వేస్తారు.
మీరు బంగారం, వెండి లేదా డైమండ్ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ప్రస్తుత ధర ఎంత? భవిష్యత్తులో ఆ నగను తిరిగి అదే షాప్‌లో బైబ్యాక్ చేసినా లేదా వేరే నగా మార్చుకున్నా ఎంత తగ్గింపు ఇస్తారు? అనే వివరాలను స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. రసీదులో ఉంటే ఇంకా మంచిది.
దంతేరాస్ రోజున భారీగా డబ్బు వెచ్చించి నగలు కొనలేని వారికి సేల్స్ సిబ్బంది నెలవారీ బంగారం పొదుపు పథకాలకు తీసుకోవాలని సూచిస్తుంటారు. స్కీమ్‌లో చేర్పించడం వారి బాధ్యత. కానీ ఆ స్కీమ్ గురించి మీరు ఒకటికి పదిసార్లు వంద రకాల ప్రశ్నలు అడగటం మంచిది. స్కీమ్‌లో చేరే ముందే కాలపరిమితి ముగిసిన తర్వాత కొనుగోలు చేసే నగలపై మేకింగ్, వీఏ ఛార్జీల మినహాయింపు ఎంతవరకు వర్తిస్తుందో వివరాలు తెలుసుకోవాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


