మియాపుర్ పోలీసులు ఓ దొంగను స్పాట్‌లోనే పట్టుకున్నారు. డయల్ 100కు కాల్ రావడంతో ఘటన స్థలానికి వెళ్లారు. అక్కడే ఉన్న దొంగను పట్టుకున్నారు. అయితే తెలిసిన మరో విషయం ఏంటంటే.. అతడు సైబర్ క్రైమ్ కోర్సులో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన వడ్డే కాటమయ్య సైబర్ క్రైమ్ కోర్సులో చేరేందుకు హైదరాబాద్ వచ్చాడు. శిక్షణ సమయంలో నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి ఏటీఎంల నుండి నగదు దొంగిలించడానికి ప్రయత్నించాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీసులు ఆదివారం రాత్రి ఏటీఎం నుండి డబ్బు దొంగిలిస్తుండగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులకు డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత వెంటనే ఘటన స్థలానికి వెళ్లి అరెస్టు చేశారు.
'కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఏటీఎం నుండి డబ్బు దొంగిలిస్తుండగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం.' అని మియాపూర్ ఏసీపీ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
నిందితుడిని కాటమయ్య సైబర్ క్రైమ్ సంబంధిత కోర్సులు నేర్చుకోవడానికి అతను హైదరాబాద్‌కు వచ్చాడు. శిక్షణ సమయంలో అతను ఏటీఎంల నుండి డబ్బు దొంగిలించడానికి సాంకేతిక పద్ధతులను నేర్చుకున్నాడు. కొన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంల సాంకేతిక ఫీచర్లను కాటమయ్య అధ్యయనం చేశాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి దొంగతనాలు చేశాడని పోలీసులు తెలిపారు.
ఒక కస్టమర్ డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నగదు బయటకు రాకుండా ఆపేందుకు నిందితులు ఏటీఎం లోపల సాంకేతిక పరికరాన్ని ఉంచేవారని ఏసీపీ తెలిపారు. లావాదేవీ విఫలమైందని భావించి కస్టమర్ వెళ్లిపోయినప్పుడు, కాటమయ్య పరికరాన్ని తీసివేసి నగదు తీసుకునేవాడు అని వెల్లడించారు.
మరో నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తికి ఇలాంటి కేసుల్లో వేరే చోట ప్రమేయం ఉందా అనే దానిపై మరింత దర్యాప్తు జరుగుతోంది.
ఏటీఎంలో ఇనుప రేకు పెట్టి
ఇటీవల వరంగల్‌లో ఏటీఎంలలో చోరీ చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5.10 లక్షల నగదు, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ఆరిఫ్‌ఖాన్, సర్ఫరాజ్, ఆష్‌మహ్మద్, షాపుస్ ఖాన్, షారూఖ్‌ఖాన్, అస్లాంఖాన్, షారుఖావ్స సులభంగా డబ్బులు సంపాదించాలని ఏటీఎంలలో లోపాలను తెలుసుకున్నారు.
{{/usCountry}}ఇటీవల వరంగల్‌లో ఏటీఎంలలో చోరీ చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5.10 లక్షల నగదు, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ఆరిఫ్‌ఖాన్, సర్ఫరాజ్, ఆష్‌మహ్మద్, షాపుస్ ఖాన్, షారూఖ్‌ఖాన్, అస్లాంఖాన్, షారుఖావ్స సులభంగా డబ్బులు సంపాదించాలని ఏటీఎంలలో లోపాలను తెలుసుకున్నారు.
{{/usCountry}}నకిలీ తాళంతో ఏటీఎంల ముందు భాగం తెరిచి.. డబ్బులు బయటకు వచ్చే మార్గంలో ఓ ఐరన్ ప్లేటును అమర్చారు. దీంతో కస్టమర్లు డబ్బు డ్రా చేసుకునే సమయంలో డబ్బు బయటకు రాకుండా మిషన్‌లోనే నిలిచిపోయేది. ఆ తర్వాత కస్టమర్ ఏటీఎం నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ ముఠా సభ్యులు మిషన్ తెరిచి.. డబ్బులు తీసుకునేవారు. వరంగల్‌కు రెండు కార్లలో వచ్చిన ఈ గ్యాంగ్.. సుబేదారి, హనుమకొండ, కాజీపేట, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 లక్షలకుపైగా చోరీ చేశారు. బ్యాంకుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు.