కొన్నిసార్లు రైల్వే టికెట్ మన పేరు మీద రిజర్వేషన్ చేసుకుంటాం. కానీ సమయానికి వెళ్లడం కుదరకపోవచ్చు. ఇంట్లో వేరేవాళ్లని పంపాలని నిర్ణయించుకుంటాం. ఇలాంటి సమయాల్లో రైల్వే టికెట్‌ను వారి పేరు మీదకు మార్చవచ్చా అనే అనుమానం ఉంటుంది.

మీ దగ్గర కన్ఫర్మ్ టికెట్ ఉండి.. ప్రయాణించలేకపోతే ఎంచుకున్న రిజర్వేషన్ కార్యాలయం చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు రైలు షెడ్యూల్ బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాలి. అలా మీరు మీ రిజర్వ్ చేసిన టికెట్‌ను మరొక ప్రయాణికుడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి.
రిజర్వ్డ్ టికెట్‌లో పేరు మార్పు అవసరమయ్యే ప్రయాణికులు ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ప్రింటవుట్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు రుజువుతో రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
అధికారుల ప్రకారం, సంబంధిత డివిజన్.. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా ప్రధాన స్టేషన్లలోని చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ కింది పరిస్థితులలో రిజర్వ్డ్ టికెట్‌లో పేరు మార్పును అనుమతించడానికి అధికారం కలిగి ఉన్నారు:
- కుటుంబంలో టికెట్‌ను బదిలీ చేయడం సాధ్యమే. ఒక ప్రయాణికుడు బయలుదేరడానికి 24 గంటల ముందు రాతపూర్వక అభ్యర్థనను సమర్పించాలి. అతడు లేదా ఆమె పేరు మీద చేసిన రిజర్వేషన్‌ను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్య.. ఇలా కుటుంబంలోని మరొక సభ్యునికి బదిలీ చేయవచ్చు. రిజర్వేషన్ మార్పును అనుమతించడానికి స్టేషన్ మేనేజర్ కూడా అధికారం ఉంటుంది.
- అధికారిక విధుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి ఆప్షన్ అందుబాటులో ఉంది. సంబంధిత అధికారి బయలుదేరడానికి 24 గంటల ముందు పేరు మార్పు కోసం లిఖితపూర్వకంగా అభ్యర్థించవచ్చు.
- విద్యార్థులు గ్రూపుగా వెళ్తుంటే.. ఎవరిపేరైనా మార్చి వేరే ప్రయాణికుడు రావాలనుకుంటే.. ఆ విద్యా సంస్థ అధిపతి బయలుదేరడానికి 48 గంటల ముందు రాతపూర్వక అభ్యర్థనను సమర్పించవచ్చు. విద్యార్థి పేరు మీద చేసిన రిజర్వేషన్‌ను అదే సంస్థలోని మరొక విద్యార్థికి బదిలీ చేయవచ్చు.
- అలాగే ప్రయాణికులు పెళ్లికి సంబంధించి వెళ్తుంటే.. ఆ గ్రూపులోని ఒక వ్యక్తి బయలుదేరడానికి 48 గంటల ముందు ఒక సభ్యుడి నుండి మరొక సభ్యుడికి రిజర్వేషన్‌ను బదిలీ చేయడానికి రాతపూర్వక అభ్యర్థన చేయవచ్చు.
- నేషనల్ క్యాడెట్ కార్ప్స్(NCC) క్యాడెట్ల సమూహానికి కూడా ఇది వర్తిస్తుంది. బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు పేరు బదిలీని అభ్యర్థించవచ్చు.
అయితే అటువంటి అభ్యర్థనలు ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. అంతేకాదు గ్రూప్‌గా వెళ్తుంటే.. మొత్తం సమూహం పరిమాణంలో 10 శాతం మించి పేరు మార్పులు అనుమతించరు. రాయితీపై జారీ చేసిన టిక్కెట్లలో పేరు మార్పు సౌకర్యం కూడా అనుమతి ఉండదు.
{{/usCountry}}అయితే అటువంటి అభ్యర్థనలు ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. అంతేకాదు గ్రూప్‌గా వెళ్తుంటే.. మొత్తం సమూహం పరిమాణంలో 10 శాతం మించి పేరు మార్పులు అనుమతించరు. రాయితీపై జారీ చేసిన టిక్కెట్లలో పేరు మార్పు సౌకర్యం కూడా అనుమతి ఉండదు.
{{/usCountry}}