...
...
Next Story

Telangana Drought : తెలంగాణలో కరువు పరిస్థితి అంచనాకు కేంద్ర బృందం

Telangana Drought : తెలంగాణలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర బృందం వచ్చింది. డిసెంబర్ 2వ తేదీన పూర్తిస్థాయి నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది.

Published on: Nov 29, 2026, 11:23:02 IST
Advertisement

తెలంగాణలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 10 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం డిసెంబర్ 3 వరకు రాష్ట్రంలోనే ఉంటుంది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఫ్రాంక్లిన్ ఎల్ ఖోబుంగ్ నేతృత్వంలోని బృందం రెండు గ్రూపులుగా విడిపోతుంది. ఒక గ్రూపు క్షేత్రస్థాయిలో పంట పరిస్థితిని అంచనా వేయడానికి నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటిస్తోంది.

తెలంగాణలో కరువు పరిస్థితులు అంచనా
తెలంగాణలో కరువు పరిస్థితులు అంచనా

రెండో బృందం తాగునీటి అవసరాలను సమీక్షించడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మెడ్చల్, నిజామాబాద్ జిల్లాలను సందర్శిస్తుంది. నవంబర్ 30న ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజుతోపాటుగా మరికొంతమంది అధికారులకు పరిస్థితిపై వివరణ ఇస్తారు. అనంతరం డిసెంబర్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వారితో చర్చిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం 365 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటన జరుగుతోంది. వీటిలో 111 మండలాలను తీవ్ర కరువు పీడిత మండలాలుగా వర్గీకరించగా, 254 మండలాలు ఓ మోస్తరుగా ప్రభావిత జాబితాలో చేర్చారు. నల్గొండ, సంగారెడ్డి (28 మండలాలు), సూర్యాపేట (23), వికారాబాద్, ఆదిలాబాద్ (20 చొప్పున), నిజామాబాద్, రంగారెడ్డి (18 చొప్పున), యాదాద్రి, ఖమ్మం (17), భద్రాద్రి-కొత్తగూడెం (16 మండలాలు) జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

కరువు పీడిత మండలాలను తెలియజేస్తూ జారీ చేసిన జీవో 3లో అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని మండలాలను చేర్చవచ్చని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం అటువంటి చర్యకు సంబంధించి బహిరంగంగా ఎలాంటి సూచన ఇవ్వలేదు. వర్షపాత వ్యత్యాసం, వర్షాలకు వర్షాలకు మధ్య పొడి వాతావరణం వంటి పారామితులను పరిగణనలోకి తీసుకునే కరువు మాన్యువల్ ఆధారంగా మండలాలను గుర్తించారు. ఈ జాబితాకు మరిన్ని మండలాలను చేర్చే అవకాశం ప్రస్తుతానికి లేదు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks