శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్రం

శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆసుపత్రి కోసం భూసేకరణ పనులు త్వరలో మెుదలుకానున్నాయి.

Published on: Dec 16, 2025, 12:59:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్, రాయికుంట గ్రామంలో 100 పడకల ESIC ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన ESIC కేంద్ర కార్యాలయంలో ఇటీవల 197వ సమావేశం జరిగింది. శంషాబాద్ లో 100 పడకల ESIC ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి(ప్రతీకాత్మక చిత్రం)
శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి(ప్రతీకాత్మక చిత్రం)

ఇప్పటికే హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈఎస్ఐ ఇన్స్యూరెన్స్ కలిగి ఉన్న కార్మికులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలను అందజేస్తోంది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రులు నాచారం, రామచంద్రాపురం, సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్ ప్రాంతాలలో కార్మికులకు వైద్య సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం శంషాబాద్ లో ఏర్పాటు చేయనున్న 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిర్మాణం జరుపుకొని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కార్మికులకు వైద్య సేవలను అందించనుంది.

ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలో 1.32 లక్షలకు పైగా ఈఎస్ఐ ఇన్స్యూరెన్స్ కలిగిన కార్మికులు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో, రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున జరుగుతున్న పారిశ్రామికీకరణకు అనుగుణంగా రాబోయే రోజులలో కార్మికుల సంఖ్య మరింతగా పెరగనుంది. శంషాబాద్ పరిధిలో చేపట్టనున్న ఈ ఆసుపత్రి నిర్మాణంతో కార్మికులకు, వారి కుటుంబాలకు అవసరమైన వైద్య సేవలు వారికి చేరువలోనే పొందే అవకాశం లభించనుంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవీయకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More