తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రులలో పోస్ట్గ్రాడ్యుయేట్ (PG) వైద్య సీట్ల పెంపునకు అనుగుణంగా సెంట్రల్సీ స్పాన్సర్డ్ స్కీమ్(CSS) కింద కేంద్ర ప్రభుత్వం రూ.379.29 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

గత రెండేళ్లలో తెలంగాణలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య 465 పెరిగింది. ఈ పథకం కింద కేంద్రం రూ.379.29 కోట్లను సమకూరుస్తుంది. అంటే ఒక్కో అదనపు పీజీ సీటుకు సగటున రూ.81.57 లక్షలు కేటాయించినట్లవుతుంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.253 కోట్లను భరిస్తుంది. వెరసి ఈ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధికి మొత్తం రూ.632 కోట్ల పెట్టుబడి సమకూరనుంది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచిన నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.108 కోట్ల విలువైన పనులను చేపట్టనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)తో పాటు నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 110 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది.
ఈ కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రులలో వసతుల మెరుగుదల కోసం కేటాయించిన రూ.108 కోట్లలో కేంద్రం రూ.64 కోట్లను అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
ఆయుష్ ప్రవేశాల మెరిట్ జాబితా విడుదల
తెలంగాణలో యూజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) కన్వీనర్ కోటా కింద అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల తాత్కాలిక మెరిట్ జాబితా, అనర్హుల జాబితాతో పాటు మాప్-అప్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను అధికారికంగా విడుదల చేసింది.
{{/usCountry}}తెలంగాణలో యూజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) కన్వీనర్ కోటా కింద అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల తాత్కాలిక మెరిట్ జాబితా, అనర్హుల జాబితాతో పాటు మాప్-అప్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను అధికారికంగా విడుదల చేసింది.
{{/usCountry}}వర్సిటీ ప్రకటించిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్ల కోసం నిర్వహించిన దరఖాస్తుల పరిశీలన అనంతరం మొత్తం 2,136 మంది విద్యార్థులతో తుది మెరిట్ జాబితాను రూపొందించారు. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా మొత్తం 45 మంది విద్యార్థులను అనర్హులుగా గుర్తిస్తున్నట్లు వర్సిటీ వెల్లడించింది. నాన్-లోకల్ కేటగిరీకి చెందడం, ధ్రువపత్రాలను సరైన క్రమంలో అప్లోడ్ చేయకపోవడం వంటి లోపాల కారణంగా వీరి దరఖాస్తులను తిరస్కరించినట్లు స్పష్టం చేసింది.
ప్రకటించిన ప్రొవిజనల్ మెరిట్, అనర్హుల జాబితాలపై అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపా,రు. ఈ నెల 17వ తేదీ ఉదయం 8:00 గంటలలోపు అభ్యంతరాలను పంపాల్సి ఉంటుంది.
అభ్యంతరాలను సరైన ఆధారాలతో knruhsayush@gmail.com అనే ఈ-మెయిల్ చిరునామాకు మాత్రమే మెయిల్ చేయాలని సూచించారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
మరోవైపు ఆయుష్ కోర్సుల మాప్-అప్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జాబితాను కూడా వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మైనార్టీ మెడికల్ కళాశాలల వారీగా కేటాయించిన సీట్ల వివరాలను విద్యార్థులు పరిశీలించుకోవచ్చు. మాప్-అప్ రౌండ్లో సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి, ఫీజు చెల్లించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.