TG Inter Exams 2027 : తెలంగాణ ఇంటర్‌ ఎగ్జామ్స్ ఫీజు షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు, రుసుముల వివరాలు

TS Inter Exams 2027 Fee Schedule : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు, రుసుముల వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు.

Published on: Oct 15, 2026, 19:51:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TGBIE) మార్చి 2027లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు (IPE March 2027) సంబంధించిన ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా పూర్తి వివరాలను వెల్లడించారు.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన అభ్యర్థులు (జనరల్, వొకేషనల్), అలాగే అటెండెన్స్ మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు (ఆర్ట్స్/హ్యుమానిటీస్ గ్రూపులు) ఈ ఫీజు చెల్లించేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు చివరి తేదీల వివరాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుము లేకుండా 26-10-2026 నుండి 09-11-2026 వరకు చెల్లించవచ్చు.

ముఖ్యమైన తేదీలు

రూ.100 ఆలస్య రుసుముతో 11-11-2026 నుండి 20-11-2026 వరకు చెల్లించాలి.

రూ.500 ఆలస్య రుసుముతో 22-11-2026 నుండి 29-11-2026 వరకు ఫీజు పే చేయవచ్చు.

రూ.1,000 ఆలస్య రుసుముతో 01-12-2026 నుండి 07-12-2026 వరకు చెయెుచ్చు.

రూ.2,000 ఆలస్య రుసుముతో 09-12-2026 నుండి 14-12-2026 వరకు ఫీజు చెల్లించాలి.

ఫీజుల వివరాలు

కోర్సుల వారీగా పరీక్షల ఫీజు వివరాలు చూసుకుంటే.. పరీక్షలకు హాజరయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్, వొకేషనల్ విద్యార్థులకు చెల్లించాల్సిన రుసుము వివరాలను బోర్డు స్పష్టంగా ప్రకటించింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ రెగ్యులర్-రూ.540.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రెగ్యులర్-రూ.890 (థియరీ: రూ.540 + ప్రాక్టికల్స్: రూ.250 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: రూ.100).

ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్-రూ.540.

ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్-రూ.890(థియరీ: రూ.540 + ప్రాక్టికల్స్: రూ.250 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: రూ.100).

ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్-రూ.890(థియరీ: రూ.540 + ప్రాక్టికల్స్: రూ.250 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్: రూ.100).

విద్యార్థులు తమ తమ కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా నిబంధనల ప్రకారం నిర్దేశిత తేదీల్లోగా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా, ఎలాంటి ఫైన్ లేదా ఆలస్య రుసుము పడకుండా అక్టోబర్ 26 నుండి నవంబర్ 09 మధ్యలోనే ఫీజు చెల్లించడం ఉత్తమం. దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, సబ్జెక్టులు, గ్రూపుల ఎంపికను సరిగ్గా చెక్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More