యాదాద్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 70 ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

Yadadri Bhuvanagiri Medical College Recruitment 2026 : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన స్థానిక అభ్యర్థులు సెప్టెంబర్ 23 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Sep 20, 2026, 13:32:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yadadri Bhuvanagiri Medical College Recruitment 2026 : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ (పొరుగు సేవల) ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 70 ఖాళీలున్నాయి. భువనగిరి జిల్లాకు చెందిన స్థానిక అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

ఖాళీల వివరాలు:

1. స్పీచ్‌ థెరఫిస్ట్‌: 01

2. సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 1

3. ల్యాబ్ టెక్నీషియన్ : 1

4. ECG టెక్నీషియన్: 1

5. డెంటల్ టెక్నీషియన్: 1

6. చైల్డ్ సైకాలజిస్ట్ (పీడియాట్రిక్స్): 1

7. ఆడియోమెట్రీ టెక్నీషియన్ : 1

8. టైలర్: 1

9. రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్: 1

10. రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్: 1

11. ప్లంబర్ : 1

12. ఓ.టి (O.T) టెక్నీషియన్ (అనస్థీషియా): 2

13. మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్: 01

14. డ్రైవర్: 6

15. డేటా ఎంట్రీ ఆపరేటర్: 16

16. కార్పెంటర్: 1

17. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్: 03

18. బార్బర్: 3

19. ఆడియో విజువల్ టెక్నీషియన్ : 01

20. వార్డ్ బాయ్: 2

21. థియేటర్ అసిస్టెంట్: 3

22. ఆఫీస్ సబార్డినేట్: 14

23. ల్యాబ్ అటెండెంట్: 4

24. ధోబీ / ప్యాకర్: 3.

పోస్టును బట్టి పదో తరగతి , ఐటీఐ (ITI), సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, డిగ్రీ, బీఏఎస్‌ఎల్‌పీ (BASLP), బీఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ , ఎంఎల్టీ (MLT), డీఎంఎల్టీ (DMLT), పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. అలాగే పారామెడికల్ పోస్టులకు సంబంధిత తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన పోస్టును బట్టి జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు ….

అర్హత ఉన్న అభ్యర్థులు https://yadadri.telangana.gov.in/ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు నమూనాను డౌన్‌రోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అన్ని విద్యా అర్హతల సర్టిఫికెట్లు, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్ల నకళ్లను జతచేయాలి.

పూర్తి చేసిన దరఖాస్తులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ F8 లో ఉన్న 'తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (TEAM)' కార్యాలయంలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు నమోదు రుసుము రూ. 50/- లను నగదు రూపంలోనే చెల్లించాలి. పోస్ట్ ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించరు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23, 2026 సాయంత్రం 5 గంటలు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More