TG Police Recruitment : 7,437 పోలీస్ ఉద్యోగాలు - రేపటితో ముగియనున్న దరఖాస్తులు! ఇదే చివరి ఛాన్స్
TSLPRB Recruitment 2026 : తెలంగాణ పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 16తో ముగియనుంది. అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
TSLPRB Recruitment 2026 : తెలంగాణలో పోలీసు కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు టీఎస్‌ఎల్‌ఆర్‌బీ కీలక సూచన చేసింది. విధి నిర్వహణలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. పోలీస్ ఉద్యోగాల ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రేపటి(సెప్టెంబర్ 16)తో ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఇటీవలే విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం…. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రారంభ నోటిఫికేషన్ ప్రకారంగా సెప్టెంబర్ 9వ తేదీనే చివరి తేదిగా నిర్ణయించినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అధికారులు గడువును పెంచారు. ఈ పెంచిన గడువు రేపటితో ముగుస్తుండటంతో…. మరోసారి తేదీలను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాబట్టి చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు ఎదురవకుండా ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.
మొత్తం 7,437 ఖాళీల వివరాలు:
గత జులై 29న టీఎస్‌ఎల్‌ఆర్‌బీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:
- పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు
- స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్: 1,380 పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్ - AR): 1,052 పోస్టులు
- ఫైర్ ఫైటర్ (తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్): 751 పోస్టులు
- జైలు వార్డర్ (తెలంగాణ జైళ్ల శాఖ): 208 పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL - పురుషులు): 24 పోస్టులు
- అధికారిక వెబ్ సైట్ - https://www.tgprb.in/
పోస్టుల స్థాయిని బట్టి బోర్డు ఫీజు వివరాలను నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్ (SI) స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకునే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.750, అలాగే ఇతర వర్గాల (ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులకు దరఖాస్తు చేసే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 గాను, మిగతా అభ్యర్థులందరికీ రూ.1,200 గాను ఫీజును నిర్ణయించారు.
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉండి దరఖాస్తు చేసే వారికి బోర్డు ఒక మంచి వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)లను ఒకే ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన ఫలితాలనే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల పోస్టులకూ ప్రామాణికంగా పరిగణిస్తారు. దీనివల్ల ప్రతి పోస్టుకు వేర్వేరుగా ఫిజికల్ టెస్టులు హాజరవ్వాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

