New Timetable : ఎస్సీ సంక్షేమ గురుకులాల వేళల్లో మార్పు.. కొత్త టైమ్ టేబులు ఇదే
ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టైమింగ్స్ మార్చారు. ఈ మేరకు కొత్త టైమ్ టేబుల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల సమయ వేళల్లో విద్యాశాఖ, గురుకుల సొసైటీ కీలక మార్పులు చేశాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈ విద్యాసంవత్సరం (2026-27) నుంచి గురుకులాల పనివేళలను సవరించారు. గతంలో అమల్లో ఉన్న సమయపాలన వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త టైంటేబుల్ వివరాలు ఇవే..
గతంలో ఎస్సీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉదయం 8:00 గంటలకే ప్రారంభమై, సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగేవి. అయితే, ఉదయాన్నే తరగతులు ప్రారంభం కావడం వల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే రోజువారీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిని పరిశీలించిన సొసైటీ ఇన్‌ఛార్జి కార్యదర్శి శారద సరికొత్త ఆదేశాలను జారీ చేశారు. పాత సమయం ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేది. కానీ దీనిని మారుస్తూ.. కొత్త సమయం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు చేశారు.
ఈ మార్పు ద్వారా ఉదయం వేళలో విద్యార్థులకు అదనంగా ఒక గంట సమయం లభించనుంది. ఇది వారి మానసిక ఉల్లాసానికి, ప్రశాంతంగా సిద్ధమవడానికి ఎంతగానో దోహదపడుతుంది.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
టైంటేబుల్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగుల అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలరాజు, దయాకర్, ఎట్‌గ్రీవ అధ్యక్షుడు కూకుట్ల యాదయ్యలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
ఫలితాలు విడుదల
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని వివిధ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాలు సొసైటీ పరిధిలోని సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE), నాన్-సీఓఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించినవి.
- మొత్తం అందుబాటులో ఉన్న సీట్లు: 19,740
- పరీక్షకు హాజరైన విద్యార్థులు: 39,052 మంది (మే 15న జరిగిన పరీక్ష)
- ఫేజ్-1లో సీట్లు పొందిన వారు: 18,401 మంది
- ఇంకా మిగిలి ఉన్న సీట్లు: 1,339
రాష్ట్రవ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచే ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థులు తమ అన్ని రకాల ఒరిజినల్ ధ్రువపత్రాలతో జూన్ 7లోపు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచే క్లాసులు ప్రారంభం అవుతున్నందున, విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఉండేందుకు మొదటి రోజు నుంచే వారిని కళాశాలలకు పంపాలని తల్లిదండ్రులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


