...
...
Next Story

TS DOST Counselling : దోస్త్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - కొత్త తేదీల వివరాలు ఇవే!

TG DOST 3rd Phase Counselling 2026 : తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల కొత్త తేదీలను మార్పు చేశారు.

Published on: Jun 16, 2026 01:29 PM IST
Advertisement

TG DOST 3rd Phase Counselling : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన గమనింపు. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (DOST) 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన మూడో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దోస్త్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ సవరించిన తేదీల వివరాలను వెల్లడించారు. వివిధ కారణాల వల్ల ఈ విడత కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు.

దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు….

దోస్త్ మూడో విడత షెడ్యూల్ మార్పు
దోస్త్ మూడో విడత షెడ్యూల్ మార్పు

మారిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు…… ఈ నెల 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దోస్త్ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత క్రమాన్ని ఈ నిర్ణీత కాలంలోనే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల ఆధారంగా జూన్ 25వ తేదీన అభ్యర్థులకు డిగ్రీ సీట్లను కేటాయిస్తామని కన్వీనర్ స్పష్టం చేశారు. డిగ్రీలో చేరాలనుకునే అభ్యర్థులు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

కొత్తగా రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలా చూసుకోవాలి. ఇప్పటికే మొదటి లేదా రెండో విడతలో సీటు వచ్చి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు, మెరుగైన కాలేజీ కోసం నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 3 లో కొత్తగా సీటు వస్తే…. పాత సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుందని అభ్యర్థులు గమనించాలి. అభ్యర్థులు మరింత సమాచారం కోసం మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in ను సందర్శించవచ్చు.

TS DOST 2026 - రిజిస్ట్రేషన్ ఇలా :

2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.

4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.

5. దరఖాస్తు రుసుము చెల్లించండి.

6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe