జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపట్టే చేప ప్రసాదం పంపిణీపై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జూన్ 8 మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వందల సంవత్సరాలుగా మృగశిర రోజు చేప ప్రసాదం పంపిణీ.. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం చేస్తుందన్నారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
'పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆర్అండ్‌బీ విభాగాలు కలిసి పనిచేయాలి. శానిటేషన్, బారికేడ్లను ఏర్పాటు చేయడం, విద్యుత్ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, తాగునీటి సరఫరా చేయాలి. ప్రభుత్వ విభాగాల అధికారులు చేసే ఏర్పాట్లతోపాటు ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చే వారికి అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, బత్తిని ట్రస్ట్‌లు ఆహారాన్ని అందించడం చేస్తున్నారు. ఈసారి వారి కార్యక్రమాలు కొనసాగించాలి.' అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
చేప ప్రసాదం కోసం తెలంగాణ నలుమూలల జిల్లాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు విదేశాల నుండి కూడా చేప ప్రసాదం కోసం వస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాంతి భద్రతల సమస్య లేకుండా, క్యూలైన్‌లలో రద్దీ తోపులాట లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఆర్టీసీ, మెట్రో ప్రధాన బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్ల నుండి ప్రత్యేక సర్వీసులు నడిపించాలన్నారు.
'రాత్రి పూట ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలి. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. స్టేజి, బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌తో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. గత సంవత్సరం చేసిన ఏర్పాట్లకు మించి చేయాలి. ఎన్ని చేపలు అవసరం ఉన్నాయో ఫిషరీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలి.' అని పొన్నం ప్రబాకర్ అన్నారు.
{{/usCountry}}'రాత్రి పూట ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలి. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. స్టేజి, బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌తో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. గత సంవత్సరం చేసిన ఏర్పాట్లకు మించి చేయాలి. ఎన్ని చేపలు అవసరం ఉన్నాయో ఫిషరీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలి.' అని పొన్నం ప్రబాకర్ అన్నారు.
{{/usCountry}}ఈసారి లక్ష 25 వేల చేప పిల్లలు అందుబాటులో ఉంచుకున్నారని, అదనంగా కూడా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. 35 కౌంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేయాలన్నారు. ఐఅండ్ పీఆర్ సమాచార శాఖ అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుండాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గతంలో 3 ఫైర్ ఇంజన్లు పెట్టారని, అదనంగా కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.