Chicken Price : తెలంగాణలో పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంత ఉందంటే?
Chicken Price : తెలంగాణలో చికెన్ ధరలు పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని మోస్తున్న జనాలకు చికెన్ ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి.
గత వారం రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాలు, ఫారాల నుండి సరఫరా తగ్గడమే ఈ పెరుగుదలకు కారణాలని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం లైవ్ చికెన్ మాంసం కిలోకు రూ.190-220 చొప్పున అమ్ముడవుతుండగా, శుభ్రం చేసిన బ్రాయిలర్ కోడి మాంసం ధరలు కిలోకు రూ350-370కి పెరిగాయి. వారం రోజుల క్రితం ఈ ధరలు కిలోకు సుమారు రూ.250గా ఉండేవి.

తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా కోళ్ల మరణాల రేటు అధికమవుతోందని, నగర మార్కెట్లకు కోళ్ల రాక కూడా తగ్గిందని వ్యాపారులు తెలిపారు. తీవ్రమైన వేడి కారణంగా రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు
ప్రతి వేసవిలో కొంత ప్రభావం కనిపిస్తుంది, కానీ ఈ ఏడాది వేడి చాలా తీవ్రంగా ఉంది. చాలా కోళ్లు ఈ ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోతున్నాయి, రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ కారణంగా కొద్ది రోజుల్లోనే ధరలు కిలోకు దాదాపు రూ.70 నుంచి రూ.80 పెరిగాయి. సాధారణంగా వేసవి కాలంలో జనాలు తేలికపాటి ఆహారాన్ని ఇష్టపడటంతో చికెన్‌కు డిమాండ్ తగ్గుతుంది. కానీ డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ సరఫరా గణనీయంగా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి.
పెరిగిన రవాణా, కూలింగ్ ఖర్చులను రిటైలర్లు కారణంగా చూపుతున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన వేడిగాలుల కారణంగా రవాణా, కూలింగ్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయని రిటైలర్లు పేర్కొన్నారు. మరోవైపు ధరలతో వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ దుకాణ యజమానులు కూడా ఒత్తిడిలో ఉన్నారు. టోకు వ్యాపారుల నుండి చాలా ఎక్కువ ధరలకు చికెన్ కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.
తెలంగాణలో సగటున సుమారు 11 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తారు. ఎండల కారణంగా కోళ్ల బరువు తూగకపోవడం కారణంగా కూడా 1.5 కిలోలకే పరిమితం అవడం కారణంగా మార్కెట్లోకి తక్కువ మాంసం వస్తోంది. అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితితో ధరలు విపరీతంగా పెరిగాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
- మే నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. దీంతో కోళ్లు వేడిని తట్టుకోలేక చనిపోతున్నాయి. దీంతో ఫారాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది.
- పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్ హాల్స్, హోటళ్ల నుంచి ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి, సప్లై తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి.
- కోళ్లకు పెట్టే మేత మెుక్కజొన్న, సోయా ధరలు పెరుగడం కారణంగా నిర్వహణ ఖర్చు భారమైపోతోంది. రైతులు కోళ్ల పెంపకాన్ని చాలా వరకు తగ్గించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


