...
...
Next Story

Cine Magical Glow Run : ఈనెల 14న రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'గ్లో రన్‌' - మీరు కూడా పాల్గొనొచ్చు..!

రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈ నెల 14వ తేదీన ‘సినీ మ్యాజికల్‌ గ్లో రన్‌’ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన జెర్సీ, విజేత పతకం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీ సందడిగా జరిగింది.

Published on: Mar 3, 2026, 13:13:42 IST
Advertisement

రామోజ్ ఫిల్మ్ సిటీ వేదికగా ఈనెల 14వ తేదీన 'సినీ మ్యాజికల్‌ గ్లో రన్‌' జరగనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక ఈవెంట్‌లో ప్రొఫెషనల్ రన్నర్లు మాత్రమే కాదు ఆసక్తి ఉన్న కుటుంబాలు కూడా పాల్గొనొచ్చు.

సినీ మ్యాజికల్‌ గ్లో రన్‌’  - జెర్సీ, విజేత పతకం ఆవిష్కరణ
సినీ మ్యాజికల్‌ గ్లో రన్‌’ - జెర్సీ, విజేత పతకం ఆవిష్కరణ

ఈ గ్లో రన్‌కు సంబంధించిన జెర్సీ, విజేత పతకం ఆవిష్కరణ కార్యక్రమాాన్ని సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీ సందడిగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథిగా అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం జెర్సీ పాల్గొనగా…. పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెర్సీని రన్ అంబాసిడర్లకు అందజేశారు.

ఈ సందర్భంగా దీపికా రెడ్డి మాట్లాడుతూ…. “గ్లో రన్‌లో కార్యక్రమంలోని ప్రతి అడుగు ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఈ రన్ గెలవడానికి మాత్రమే కాదు.. పాల్గొనడానికి కూడా..! కాబట్టి ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ విజేతలే” అని వ్యాఖ్యానించారు. క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నెం మాట్లాడుతూ.. ప్రశాంతమైన మనసు, శారీరక ఆరోగ్యం కోసం పరుగెత్తడాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు.

3 విభాగాల్లో పోటీలు:

  • 3 కిలోమీటర్లు – ప్రారంభ దశలో ఉన్నవారు, కుటుంబాలు, మొదటిసారి రన్నర్ల కోసం (ఫన్ రన్)
  • 5 కిలోమీటర్లు – యాక్టివ్ రన్నర్ల కోసం (టైమ్‌డ్ రన్)
  • 10 కిలోమీటర్లు నైట్ ఛాలెంజ్ – అనుభవజ్ఞులైన రన్నర్ల కోసం (టైమ్‌డ్ రన్)

ఈ గ్లో రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సౌకర్యార్థం ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు ఉచిత రవాణా సదుపాయం కల్పించబడింది. ఈవెంట్ అనంతరం డీజే గ్లో పార్టీ నిర్వహించబడుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe