...
...
Next Story

Hyderabad : హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Published on: Apr 5, 2026, 14:56:37 IST
Advertisement

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. బుద్వెల్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలతో కొత్త హైకోర్టు సముదాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన భవన నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రెండో దశలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి.. న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు.

హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన
హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన

రాష్ట్రంలో న్యాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయవ్యవస్థ పనితీరు కోసం అత్యాధునిక సౌకర్యాలను అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

ప్రతిపాదిత 100 ఎకరాల జ్యుడీషియల్ సిటీలో భాగంగా ఉన్న ఈ జోన్-II కాంప్లెక్స్‌కు ఈ కార్యక్రమంలో భూమి పూజ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణాళికాబద్ధమైన భవన సముదాయాలను ప్రదర్శించే ఒక నమూనా ప్రదర్శనను కూడా సమీక్షించారు.

తెలంగాణలో హైకోర్టు కొత్త సముదాయ నిర్మాణం అద్భుతంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. తెలంగాణ హైకోర్టుకు ఇది ముఖ్యమైన ప్రాజెక్టు అన్నారు. కోర్టు గదులు మాత్రమే కాదని, వాటి వెనక పెద్ద వ్యవస్థ ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ సజావుగా నడిపేందుకు మౌలిక వసతులు చాలా అవసరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా.. ఆలోచన చేసి నూతన హైకోర్టు భవనం నిర్మాణం చేపట్టిందన్నారు.

'పాత హైకోర్టు చారిత్రాత్మకమైనది. కానీ ప్రస్తుతం సరిపోవడం లేదు. ఈ కారణంగా ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా లేదు. వచ్చే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. నూతన హైకోర్టు నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు.' అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe