శ్రీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాంసం విక్రయాలపై కీలక ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 4వ తేదీన నగరంలోని మేకలు, గొర్రెల వధశాలలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 533(b) ప్రకారం కార్పొరేషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి పండుగ రోజున ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ, నగరంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
ఈ మూసివేత ఉత్తర్వులను నగరంలో అత్యంత కఠినంగా అమలు చేయడానికి వీలుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సహకారాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ కమిషనర్లు, స్థానిక పోలీసులు.. మున్సిపల్ అధికారులకు పూర్తి స్థాయి సహకారం అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 4న ఉదయం నుంచే నగరంలోని అన్ని సర్కిళ్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్థానిక పోలీసులు కలసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలను ఉల్లంఘించి దొంగచాటుగా మాంసం విక్రయించినా, వధశాలలు నిర్వహించినా సదరు షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా విక్రయించే మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, వ్యాపారులపై భారీగా జరిమానాలు విధించడం, షాపుల లైసెన్సులను రద్దు చేయడం వంటి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న మాంసం వ్యాపారులు, చికెన్, మటన్, బీఫ్ షాపుల యజమానులు, వధశాలల నిర్వాహకులు ఈ ఉత్తర్వులను గౌరవించి పూర్తి స్థాయిలో సహకరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నగర ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి, పండుగ రోజున తగిన విధంగా సహకరించాలని కోరారు.
{{/usCountry}}జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న మాంసం వ్యాపారులు, చికెన్, మటన్, బీఫ్ షాపుల యజమానులు, వధశాలల నిర్వాహకులు ఈ ఉత్తర్వులను గౌరవించి పూర్తి స్థాయిలో సహకరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నగర ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి, పండుగ రోజున తగిన విధంగా సహకరించాలని కోరారు.
{{/usCountry}}పండుగల సమయాల్లో, విశిష్టమైన ఆధ్యాత్మిక దినాలలో జంతు వధను నిరోధించడం, శాంతిభద్రతల పరిరక్షణ, నగర పరిశుభ్రతను కాపాడటంలో భాగమేనని అధికారులు తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆకాంక్షించారు.