హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతం 1.34 కోట్ల జనాభాతో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ భారీ మహానగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సీఎం శంకుస్థాపన…

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఈ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పండ్ల మార్కెట్‌తో పాటే అదే ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి కూడా ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం - సీఎం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అవసరమైన అన్ని రకాల పండ్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా 240 ఎకరాల విస్తీర్ణంలో, రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో ఈ అత్యాధునిక మార్కెట్‌ను రూపుదిద్దుతున్నట్లు వివరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత హైదరాబాద్ నగరానికి ఈ కోహెడ మార్కెట్ ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత 30, 40 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా పండ్లు, కూరగాయల సాగుతో ఎంతో కళకళలాడేదని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లా రైతులు రాత్రింబగళ్లు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు అవసరమైన పండ్లు, కూరగాయలు, పాలను నిరంతరం సరఫరా చేసేవారని చెప్పారు. అయితే కాలక్రమేణా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా విస్తరించడంతో ఇక్కడ వ్యవసాయ సాగు భూములు తగ్గిపోయి, సాగు కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రస్తుతం నగర ప్రజలు ఏది కొనాలన్నా పక్క రాష్ట్రాలపై ఆధారపడి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితి మారాలంటే రైతులకు లాభసాటిగా ఉండేలా…. ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు, తోటల పెంపకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్థానిక రైతులు, ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఈ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించిందని చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మార్కెట్ నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు గ్రీన్ చానెల్ ద్వారా నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే డిసెంబర్ నాటికి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా అధికారులు, మంత్రులు ప్రత్యేక శ్రద్ధతో శ్రమించాలని ఆదేశించారు.
{{/usCountry}}ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితి మారాలంటే రైతులకు లాభసాటిగా ఉండేలా…. ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు, తోటల పెంపకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్థానిక రైతులు, ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఈ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించిందని చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మార్కెట్ నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు గ్రీన్ చానెల్ ద్వారా నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే డిసెంబర్ నాటికి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా అధికారులు, మంత్రులు ప్రత్యేక శ్రద్ధతో శ్రమించాలని ఆదేశించారు.
{{/usCountry}}రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ఏటా దాదాపు 15 వేల కోట్ల నుంచి 16 వేల కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని సమకూరుస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ, సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తే కూర్చోవడానికి కనీసం ఒక కుర్చీ కూడా లేని దుస్థితి ఉందన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతోనే, అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో కూడిన సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి ఇక్కడే శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి, అత్యంత ఆధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించనున్నట్లు ప్రకటించారు.