నిజామాబాద్ జిల్లాలో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు - సీఎం రేవంత్ శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తామని చెప్పారు.

Published on: Feb 6, 2026, 21:25:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ప్రతి పాఠశాలకు రూ. 200 కోట్ల చొప్పున) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. "ప్రజాపాలన – ప్రగతిబాట" కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు - సీఎం రేవంత్ శంకుస్థాపన
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు - సీఎం రేవంత్ శంకుస్థాపన

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ… తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ వేదికగా ఇందూరు జిల్లా మహిళా సమాఖ్య (1614 స్వయం సహాయక సంఘాలు) కు రూ. 200 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు.

“నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారుపేరు. ఇక్కడి వ్యవసాయం దేశానికే ఆదర్శం. ఈ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదనంగా నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు:

  • రూ. 20 కోట్లతో తెలంగాణ యూనివర్శిటీ డిచ్‌పల్లిలో ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణం.
  • గిరిజన సంక్షేమ శాఖ – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్‌వాయిలో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులు.
  • ఆర్మూర్, బోధన్ మరియు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ YIIRS నిర్మాణం.
  • రూ. 8.60 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణం.
  • అలాగే యూనివర్సిటీలో 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం. రూ. 43 కోట్ల అంచనా వ్యయంతో వర్సిటీ ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనాల విస్తరణ పనులు
  • రూ. 18 కోట్లతో చేపట్టిన యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం
  • రూ. 21 కోట్ల అంచనా వ్యయంతో నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోలా రోడ్డు వరకు (0/0 కి.మీ నుండి 5/8 కి.మీ), పీడబ్ల్యూడీ & జేఎన్‌ఎన్ రోడ్డు నుండి సిరన్‌పల్లి మీదుగా నిజాంపూర్ వరకు (0/0 కి.మీ నుండి 8/2 కి.మీ) రోడ్డు వెడల్పు పనులు.

“ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇస్తున్నా 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినం. మళ్ళీ 2029లో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా ఆనాడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండోసారి ఏ విధంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చినారో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదు వాళ్ళిద్దరిది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ బంధం విడదీయరానిదన్నారు. బీజేపీకి వేసినా, బీఆర్ఎస్ కు వేసినా ఆ ఓట్లు మూసీ నదిలో కలిపినట్టే అని వ్యాఖ్యానించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More