...
...
Next Story

పెట్టుబడులన్నీ గుజరాత్‌కే రావాలా? కేంద్రంపై సీఎం రేవంత్ విమర్శలు

తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు.

Published on: Aug 24, 2026, 17:45:19 IST
Advertisement

తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ నినాదంతో తలపెట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పర్యటనను అడ్డుకోవడం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి జరిగిన పరాభవం కాదని, ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమానించడమేనని దుయ్యబట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

గతంలో వైబ్రెంట్ గుజరాత్ పేరుతో గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికాలో 8 రోజుల పాటు పర్యటించి ర్యాలీలు నిర్వహించడానికి విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిందని, మరి తెలంగాణ సీఎం పర్యటనకు వచ్చేసరికి ఎందుకు అడ్డుకున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

విదేశీ పర్యటనకు దరఖాస్తు చేసినప్పుడే విద్య, క్రీడలు, రాష్ట్రంలో పెట్టుబడులు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులతో సమావేశాల షెడ్యూల్‌ను విదేశాంగ శాఖకు స్పష్టంగా అందించామని సీఎం తెలిపారు. కానీ రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకే విజ్ఞప్తిలో బ్రిటన్ పర్యటనకు ఓకే చెప్పి, యూఎస్ పర్యటనను నిరాకరించడం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందన్నారు.

దేశానికి వచ్చే అంతర్జాతీయ పెట్టుబడులను కేవలం గుజరాత్‌కు మాత్రమే మళ్లించుకోవాలనే దురుద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాని భారత్‌ మొత్తానికి ప్రాతినిధ్యం వహించాల్సింది పోయి, కేవలం గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో ఉన్న కొందరు బీజేపీ నాయకులు అవాస్తవాలతో విదేశాంగ శాఖను తప్పుదోవ పట్టించారని సీఎం ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే ప్రతి కార్యక్రమాన్ని భారత రాయబార కార్యాలయ అధికారులు పర్యవేక్షిస్తారని, అలాంటప్పుడు ఇందులో రహస్యమేమీ ఉండదని స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe