...
...
Next Story

ఎలివేటెడ్‌ కారిడార్లతో హైదరాబాద్‌ అద్భుతంగా మారుతుంది : సీఎం రేవంత్ రెడ్డి

ఎలివేటెడ్‌ కారిడార్లతో హైదరాబాద్‌ అద్భుత నగరంగా మారుతుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయన్నారు.

Published on: Mar 23, 2026 02:33 PM IST
Advertisement

శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభిజించి ట్రాఫిక్‌ రద్దీ తగ్గేలా చూస్తున్నామన్నారు. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ప్రతీ కుటుంబంలో కార్లు పెరిగాయని చెప్పారు. ట్రాఫిక్ రద్దీతో మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరించుకున్నామని చెప్పారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారంటే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

'దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో తలెత్తుతున్న విషమ పరిస్థితులను గమనంలోకి తీసుకుని చరిత్రాత్మక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉంది.

నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదనా భరితమైన జీవిత సత్యాల గురించి ఆలోచన చేసే వారెవరూ ఈ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన చేయరు. కావాలనుకుంటే మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తాం.

ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆ రాష్ట్ర నగరాలు, పెట్టుబడులు, ప్రజల జీవన స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఎప్పుడు చర్చ జరిగినా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల గురించి ఎక్కువగా చర్చిస్తారు. హైదరాబాద్ అనగానే ప్రధానంగా ఫార్మా రంగంతో పాటు లివబుల్ సిటీగా గుర్తుచేసుకుంటారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉన్న ముంబై వర్షాలొస్తే నివసించలేని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం, బెంగళూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు. భారీ వర్షాలొస్తే చెన్నైలో పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి.

కులీకుతుబ్ షాహీల కాలంలో గుల్జార్ హౌజ్, ఫలక్‌నుమా, తారామతి భారాదరి, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఈరోజు సమావేశాలు నిర్వహించుకుంటున్న శాసనమండలి హాలు.. ఇలా ఎంతో చరిత్ర కలిగిన అద్భుతమైన నగరం ఇప్పుడు కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందుల వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది.

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ మూడు ప్రాంతాలుగా విభజించి సమగ్రమైన ప్రణాళికలతో ఒక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. 1.34 కోట్ల జనాభా కలిగిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని కోర్ అర్భన్ రీజియన్‌గా గుర్తించి కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ జోన్‌లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించాం.

తద్వారా ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఈ క్రమంలోనే హిల్ట్ పాలసీ హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి వైపునకు తరలించి, ఇక్కడి పారిశ్రామిక జోన్‌లో ఉన్న భూములను మల్టీయూజ్ జోన్‌లోకి మార్చుతున్నామే, తప్ప యాజమాన్యపు హక్కులు మారవు. మల్టీయూజ్ జోన్‌లోకి మార్చడం వల్ల మధ్య తరగతి నివాస ప్రాంతాలుగా మారుతాయి.

పరిశ్రమలను తరలించడం ద్వారా నగరం కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నది మొట్టమొదటి ప్రణాళిక. 20 టీఎంసీ గోదావరి నీటని తరలించి అందులో 17 టీఎంసీ జంటనగరాల తాగునీటి కోసం, మిగిలిన నీటిని మూసీలో నిరంతరం నీరు ప్రవహించేలా వినియోగిస్తాం.

రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం సమగ్రమైన ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నాం. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలివ్వండి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయం. వారికి మరిన్ని మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టం చేయం' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe