బాడీ‌గార్డ్‌ను కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వీడియో వైరల్!

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన బాడీగార్డ్ మీద చేయి చేసుకున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Published on: Jan 4, 2026, 22:04:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఏదో కార్యక్రమంలో భాగంగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా వీడియోలో చూడవచ్చు. అయితే ప్రదక్షిణలు చేసే సమయంలో అక్కడే ఉన్న జనాలు కాస్త ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో బాడీగార్డ్ మీద రేవంత్ రెడ్డి చేయి చేసుకున్నారని ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం రేవంత్ రెడ్డి వీడియో వైరల్
సీఎం రేవంత్ రెడ్డి వీడియో వైరల్

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలు స్పందిస్తున్నారు. చేతిలో అధికారం ఉందని ఇలా బాడీగార్డ్‌ను కొట్టడం ఏంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 'నీకు సెక్యూరిటీగా వాళ్లు చేసే జాబ్ ఎంతో కష్టపడి చదివితే వచ్చింది, కనీసం వాళ్ల చదువుకి అయినా మర్యాద ఇవ్వాలి. నువ్ కొడితే పడడానికి వాలు మీ పర్సనల్ గార్డ్స్ కాదు, They are Proud Government Servants.' అని ఒక ఇన్‌స్టా యూజర్ విమర్శించారు.

అయితే షూలు వేసుకుని గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. గోమాత విలువ తెలియదని, చెప్పులు విడిచి ప్రదక్షిణలు చేయాలని కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్‌లో చాలా మంది షేర్లు చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎప్పటిది ఈ వీడియో అని తెలియాల్సి ఉంది. జనాలు మాత్రం ఈ వీడియోను తెగ వైరల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More