...
...
Next Story

సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ - భారీ క్రేన్‌పైకి వెళ్లి మీరాలం చెరువు పనుల పరిశీలన, కీలక ఆదేశాలు

Mir Alam Cheruvu Development Works : హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రేన్‌పైకి వెళ్లి సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Published on: Aug 27, 2026, 14:11:52 IST
Advertisement

Mir Alam Cheruvu Development Works : పాతబస్తీలోని చారిత్రక మీరాలం ట్యాంక్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా పర్యటించిన ఆయన…. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణాలు, ప్రణాళికలను సుదీర్ఘంగా సమీక్షించారు.

క్రేన్‌పైకి వెళ్లి పనుల పరిశీలన…

పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మీరాలం చెరువు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్-టాప్ జీపులో ప్రయాణించి పరిశీలించారు. చెరువు చుట్టూ జరుగుతున్న బ్యూటిఫికేషన్, మౌలిక వసతుల కల్పన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం… మీరాలం చెరువుపై ప్రత్యేక ఆకర్షణగా నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పనుల పురోగతిని, నాణ్యతను దగ్గరి నుంచి పరిశీలించేందుకు స్వయంగా భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లారు. ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి సాంకేతిక అంశాలపై పలు సూచనలు చేశారు.

అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని, భవిష్యత్ డిజైన్లను ముఖ్యమంత్రికి వివరించారు. మాస్టర్ ప్లాన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం, పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

కాలుష్య రహితంగా మీరాలం..

మీరాలం చెరువు పవిత్రతను, అందాన్ని కాపాడేందుకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు (సీవేజ్) ఏమాత్రం చెరువులోకి చేరకుండా పక్కాగా మళ్లించే చర్యలు చేపట్టాలని చెప్పారు. భారీ వర్షాల సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండటానికి, చెరువు నుంచి మూసీ నదిలోకి వరద నీటిని తీసుకెళ్లే ప్రధాన నాలాను తక్షణమే విస్తరించాలని అధికారులకు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe