మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చాముండేశ్వరి ఆలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

Published on: Oct 21, 2026, 21:09:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.

మైసూర్ దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి
మైసూర్ దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి

కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. కర్నాటక నాడ హబ్బ (రాష్ట్ర పండుగ) ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు ఎంతోమంది దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతో కలిసి ఉత్సవాలను వీక్షించారు.

మైసూరు రాజభవనం వద్ద నిర్వహించిన ఈ దసరా వేడుకల్లో పాల్గొనడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రులను ఆపిన పోలీస్

దసరా జంబు సవారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తుండగా ముగ్గురు కర్ణాటక ప్రభుత్వ మంత్రులను పోలీసులు ఆపారు. సవారిని జెండా ఊపి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేదిక వైపు వెళుతున్నారు. ఆయన వెనకే కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడ్గి, మరో ఇద్దరు మంత్రులు కేఎస్ బసవంతప్ప, నరేంద్ర స్వామి కూడా వచ్చారు. ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత వెనుక వస్తున్న మంత్రిని అక్కడే ఉన్న ఒక ఐపీఎస్ అధికారి ఆపారు. అనుమతి లేదు, సార్ అని చెప్పారు.

పోలీసు అధికారి అతన్ని ఆపగానే.. శివరాజ్ తంగడ్గి చేయి "నేను సాంస్కృతిక శాఖ మంత్రిని" అని చెప్పి ముందుకు కదిలారు. కాస్త అరిచినట్టుగా కనిపించింది. ముఖ్యమంత్రి వెనక్కి తిరిగి ఆదేశాలు ఇవ్వగానే పోలీసులు నిశ్శబ్దమయ్యారు. మంత్రి అధికారి ముఖంలోకి సూటిగా చూస్తూ ముందుకు కదిలారు. పోలీసులు మంత్రిని అడ్డగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More