Shastripuram ROB Flyover in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాతబస్తీ ఏరియాలో తలపెట్టిన శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది.

సికింద్రాబాద్ - ఫలక్‌నుమా - శివరాంపల్లి రైల్వే లైన్‌పై ఎల్‌సీ నంబర్ 7 వద్ద నిర్మించిన ఈ గ్రేడ్ సెపరేటర్ (ఆర్‌ఓబీ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభిస్తారు. మైలార్‌దేవ్‌పల్లి, ఫలక్‌నుమా ఆర్‌టీసీ బస్ డిపో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
ప్రాజెక్ట్ విశేషాలు :
- మొత్తం రూ.71.0 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది.
- ఈ వంతెన మొత్తం పొడవు 490 మీటర్లు కాగా, అందులో రైల్వే ట్రాక్‌ల పైనుంచి వెళ్లే భాగం (Railway Portion) 37.28 మీటర్లుగా ఉంది.
- వాహనాల రాకపోకలకు వీలుగా దీని వెడల్పును 16.60 మీటర్లుగా నిర్ణయించారు.
- ఇది 4-లేన్ల క్యారేజ్ వే (ఇరువైపులా రెండు వరుసలు) కలిగి ఉండటంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.
- ఓపెన్ ఫౌండేషన్లపై సింగిల్ పియర్స్, ఆర్‌సీసీ ప్రీకాస్ట్ పియర్ క్యాప్స్‌తో పటిష్టంగా నిర్మించారు.
- రైల్వే భాగంలో స్టీల్ గర్డర్లను ఉపయోగించారు. వంతెన స్థిరత్వం కోసం అత్యాధునిక 'పాట్-పీటీఎఫ్‌ఈ' (POT-PTFE) బేరింగ్లను అమర్చారు.
- రీన్‌ఫోర్స్డ్ ఎర్త్ రిటైనింగ్ వాల్స్ (RE Walls), జియో స్ట్రిప్స్ సాంకేతికతతో ఇరువైపులా గోడలను నిర్మించారు. భద్రత కోసం ప్రీకాస్ట్ ఫ్రిక్షన్ స్లాబ్, క్రాష్ బారియర్లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు ఊరట…
ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు ఊరట లభించనుంది. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గతంలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ ఆర్‌ఓబీ వల్ల ప్రయాణ సమయం కనీసం 30 నిమిషాలు ఆదా అవుతుంది.
{{/usCountry}}ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు ఊరట లభించనుంది. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గతంలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ ఆర్‌ఓబీ వల్ల ప్రయాణ సమయం కనీసం 30 నిమిషాలు ఆదా అవుతుంది.
{{/usCountry}}మైలార్‌దేవ్‌పల్లి, వట్టేపల్లి, ఫలక్‌నుమా ఆర్‌టీసీ డిపోల మధ్య రాకపోకలు సాఫీగా సాగుతాయి. ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రవాణా సౌకర్యాల వల్ల ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. "ఈ ప్రాజెక్టు పూర్తవ్వడం వల్ల పాతబస్తీ రవాణా ముఖచిత్రమే మారిపోతుంది" అని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.ఈ ప్రాజెక్ట్ పూర్తికావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.