...
...
Next Story

Hyderabad Metro Phase 2 : మెట్రో రైల్ విస్తరణకు త్వరగా అనుమతులు ఇవ్వండి - కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ అనుమతులు, ఫేజ్-1 స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. ప్రాజెక్టు ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Published on: Jul 6, 2026, 08:17:00 IST
Advertisement

భాగ్యనగర భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో ఫేజ్-II విస్తరణ పనులకు అవసరమైన కేంద్ర అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి విడివిడిగా లేఖలు పంపారు.

లేఖలో కీలక అంశాలు…

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లేఖలో గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న ఉమ్మడి నిర్ణయాల ప్రకారం.. మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను ఖచ్చితంగా నిర్ధారించడం , అధిక వడ్డీతో కూడిన రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను ఒక నోడల్ ఏజెన్సీకి అప్పగించాలని భావించారు. దీనితో పాటు ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్‌బీఐ క్యాప్స్ (SBI CAPS)ను నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను ఖరారు చేయకపోవడం, ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతుండటాన్ని లేఖలో ఎత్తి చూపారు. ఈ జాప్యంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-I రోజువారీ నిర్వహణలో అనేక ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అలాగే ఫేజ్-II కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు కూడా తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడటంతో పాటు భవిష్యత్తులో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణమే పూర్తి చేయండి - సీఎం రేవంత్

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe