న్యూరో సర్జరీలో సరికొత్త సాంకేతికత - బేగంపేట కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో 'కోబోటిక్ మైక్రోస్కోప్' ప్రారంభం
మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ 'జైస్ కినెవో 900' రోబోటిక్ మైక్రోస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా అతికొద్ది కేంద్రాల్లో మాత్రమే ఈ సాంకేతికత ఉంది.
హైదరాబాద్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ వైద్య రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. బేగంపేటలోని తమ ఆసుపత్రిలో అత్యాధునిక 'జైస్ కినెవో 900' (Zeiss Kinevo 900) రోబోటిక్ మైక్రోస్కోప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో న్యూరో సర్జరీ విభాగంలో కీలకమైన ముందడుగు వేసినట్లు అయింది.

అత్యంత క్లిష్టమైన మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో శస్త్రచికిత్స నిపుణులకు ఈ సాంకేతికత ఎంతో అండగా నిలుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం కొన్ని ప్రధాన వైద్య కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆధునిక వ్యవస్థను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవ రెడ్డి ఈ అత్యాధునిక మైక్రోస్కోప్‌ను గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. "ప్రపంచ స్థాయి వైద్య సేవలను సామాన్యులకు సైతం చేరువ చేయాలన్నదే మా లక్ష్యం. ఈ కోబోటిక్ (Collaborative Robotics) సాంకేతికత ద్వారా సర్జన్లు మరింత ఆత్మవిశ్వాసంతో, అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించే వీలుంటుంది" అని అభిప్రాయపడ్డారు.
కనెవో 900 అనేది కేవలం మైక్రోస్కోప్ మాత్రమే కాదు, ఇది హై-డెఫినిషన్ ఇమేజింగ్ స్మార్ట్ ఫీచర్లతో కూడినది. ఇందులోని రోబోటిక్ ఆర్మ్ సర్జన్లకు మృదువైన, స్థిరమైన కదలికలను అందిస్తుంది. సున్నితమైన నరాల వద్ద శస్త్రచికిత్స చేసేటప్పుడు స్వల్ప మార్పులను కూడా ఇది గుర్తించి వైద్యులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా ‘పాయింట్‌లాక్’, 'పొజిషన్ మెమొరీ' వంటి ఫీచర్లు శస్త్రచికిత్స ప్రాంతంపై దృష్టి మరలకుండా స్థిరమైన ఫోకస్‌ను కొనసాగించడంలో తోడ్పడతాయి. దీనివల్ల సుదీర్ఘ సమయం పట్టే సర్జరీల్లో వైద్యుల శారీరక అలసట తగ్గుతుంది.
ట్యూమర్ల గుర్తింపు మరింత సులభం….
న్యూరో-ఆంకాలజీ (మెదడు కణితి చికిత్స)లో ఈ మైక్రోస్కోప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని 'ట్యూమర్ ఫ్లోరసెన్స్' సాంకేతికత ఆరోగ్యకరమైన మెదడు కణజాలానికి, కణితి కణజాలానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది. ఫలితంగా వైద్యులు ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం కలగకుండా కేవలం కణితిని మాత్రమే గరిష్టంగా తొలగించగలరు. అలాగే 'ICG ఫ్లోరసెన్స్' ద్వారా రక్త ప్రసరణను రియల్ టైమ్‌లో గమనించవచ్చు, ఇది వాస్క్యులర్ న్యూరో సర్జరీల్లో రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలకమవుతుంది.
సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ నవీన్ మెహ్రోత్రా ఈ సాంకేతికత ప్రాముఖ్యతను వివరిస్తూ… "3D మరియు 4K విజువలైజేషన్ వల్ల శస్త్రచికిత్స బృందం మొత్తం ప్రక్రియను ఎంతో స్పష్టంగా చూడవచ్చు. సాధారణ కంటికి కనపడని శరీర నిర్మాణ భాగాలను కూడా 'QEVO' మైక్రో-ఇన్‌స్పెక్షన్ సాధనం ద్వారా గమనించే వీలుంది. ఇది శస్త్రచికిత్స భద్రతను వంద శాతం పెంచుతుంది," అని వివరించారు.
ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సి.హెచ్. గోపాల్‌తో పాటు న్యూరోసైన్సెస్ బృందానికి చెందిన డాక్టర్ మోహన శశాంక్ దీవి, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ నివేదిత సాయి చంద్ర ఇతరలు పాల్గొన్నారు. డా. సి.హెచ్. గోపాల్ మాట్లాడుతూ… ఈ ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతల ప్రయోజనాలను వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

