ఓవర్ వెయిట్ లేదా ఊబకాయంతో బాధపడుతున్న పెద్దలలో స్థిరమైన బరువు తగ్గుదలకు, మెటబాలిజం ఆరోగ్య మెరుగుదల గురించి ఐసీఎంఆర్ కీలక విషయం వెల్లడించింది. ఇందుకోసం ఆహార నియమాలు + క్రమమైన శారీరక శ్రమ (వ్యాయామం) కలయికే అత్యంత సమర్థవంతమైన వ్యూహమని హైదరాబాద్‌లోని ICMR - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) తెలిపింది.

అంతర్జాతీయ జర్నల్ ‘ఓబేసిటీ పిల్లర్స్’లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 50కి పైగా దేశాలకు చెందిన 5.07 లక్షల మందికి పైగా పాల్గొన్న 2,332 రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌కు సంబంధించిన 112 సిస్టమాటిక్ రివ్యూలను విశ్లేషించింది. ICMR-NIN శాస్త్రవేత్తలు మహేష్ కుమార్ ముమ్మడి, సమరసింహారెడ్డి నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది.
పరిశోధనలోని ముఖ్యాంశాలు
ఆహారం + వ్యాయామం కలయికతో 12 నెలలు దాటిన తర్వాత కూడా అదనంగా సగటున 3.68 కిలోల బరువు తగ్గేందుకు ఈ కాంబినేషన్ సహాయపడింది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు(ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్), ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఇది అత్యంత ప్రతిభావంతంగా పనిచేసింది.
తక్కువ క్యాలరీల ఆహారంతో మొదటి 3 నెలల్లో సగటున 2.64 కిలోల వరకు బరువు తగ్గించి, స్వల్పకాలిక బరువు తగ్గుదలకు అత్యంత సమర్థవంతమైనదిగా నిలిచింది.
కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల ప్రారంభంలో తక్కువ బరువు తగ్గినా.., దీర్ఘకాలంలో ప్రయోజనాలు పెరిగాయి. ముఖ్యంగా 6 నుంచి 12 నెలల వ్యవధిలో సిస్టోలిక్ రక్తపోటును దాదాపు 6.1 mmHg వరకు తగ్గించి, బిపి నియంత్రణకు ఇది ఉత్తమ మార్గంగా నిలిచింది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డయాస్టోలిక్ బిపిని స్వల్పకాలంలో తగ్గించడంలో మరియు ఒక ఏడాది వరకు బరువు తగ్గించడంలో సహాయపడింది. అయితే 12 నెలల తర్వాత ఈ ఫలితాలు నిలకడగా కొనసాగలేదు.
{{/usCountry}}ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డయాస్టోలిక్ బిపిని స్వల్పకాలంలో తగ్గించడంలో మరియు ఒక ఏడాది వరకు బరువు తగ్గించడంలో సహాయపడింది. అయితే 12 నెలల తర్వాత ఈ ఫలితాలు నిలకడగా కొనసాగలేదు.
{{/usCountry}}'ఊబకాయం, దానికి సంబంధించిన ఇతర వ్యాధుల భారాన్ని తగ్గించడానికి సమగ్ర విధానం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు ఇవన్నీ విడివిడిగా పనిచేసినప్పటికీ, వీటి కలయిక మాత్రమే సుదీర్ఘమైన, విస్తృతమైన ప్రయోజనాలను ఇస్తుంది. పెరుగుతున్న ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ వంటి దేశాలకు ఈ తరహా స్థిరమైన విధానాలు ఎంతో అవసరం.' అని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు.
అయితే ఈ అధ్యయనంలో ఎక్కువ భాగం సమాచారం హై, అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ దేశాల నుంచే సేకరించింది. భారత్ వంటి లోయర్ మిడిల్ ఇన్‌కమ్ దేశాల భాగస్వామ్యం తక్కువగా ఉందని శాస్త్రవేత్త మహేష్ కుమార్ ముమ్మడి తెలిపారు. అందువల్ల మన స్థానిక పరిస్థితులకు తగినట్లుగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.