బరువు తగ్గడానికి, బీపీ, షుగర్ నియంత్రణకు అదే ఉత్తమ మార్గం : ఐసీఎంఆర్

Weight Loss : బరువు తగ్గడానికి, బీపీ, షుగర్ నియంత్రణకు పాటించాల్సిన విషయాల గురించి ICMR-NIN పరిశోధనలో కీలక విషయాలు తెలిపింది. కేవలం ఆహార నియమాలు మాత్రమే ఫాలో అయినంత మాత్రన ఫలితం ఎక్కువగా ఉండదని వెల్లడించింది.

Published on: Sep 13, 2026, 20:50:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓవర్ వెయిట్ లేదా ఊబకాయంతో బాధపడుతున్న పెద్దలలో స్థిరమైన బరువు తగ్గుదలకు, మెటబాలిజం ఆరోగ్య మెరుగుదల గురించి ఐసీఎంఆర్ కీలక విషయం వెల్లడించింది. ఇందుకోసం ఆహార నియమాలు + క్రమమైన శారీరక శ్రమ (వ్యాయామం) కలయికే అత్యంత సమర్థవంతమైన వ్యూహమని హైదరాబాద్‌లోని ICMR - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) తెలిపింది.

ఐసీఎంఆర్ పరిశోధన
ఐసీఎంఆర్ పరిశోధన

అంతర్జాతీయ జర్నల్ ‘ఓబేసిటీ పిల్లర్స్’లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 50కి పైగా దేశాలకు చెందిన 5.07 లక్షల మందికి పైగా పాల్గొన్న 2,332 రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌కు సంబంధించిన 112 సిస్టమాటిక్ రివ్యూలను విశ్లేషించింది. ICMR-NIN శాస్త్రవేత్తలు మహేష్ కుమార్ ముమ్మడి, సమరసింహారెడ్డి నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది.

పరిశోధనలోని ముఖ్యాంశాలు

ఆహారం + వ్యాయామం కలయికతో 12 నెలలు దాటిన తర్వాత కూడా అదనంగా సగటున 3.68 కిలోల బరువు తగ్గేందుకు ఈ కాంబినేషన్ సహాయపడింది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు(ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్), ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఇది అత్యంత ప్రతిభావంతంగా పనిచేసింది.

తక్కువ క్యాలరీల ఆహారంతో మొదటి 3 నెలల్లో సగటున 2.64 కిలోల వరకు బరువు తగ్గించి, స్వల్పకాలిక బరువు తగ్గుదలకు అత్యంత సమర్థవంతమైనదిగా నిలిచింది.

కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల ప్రారంభంలో తక్కువ బరువు తగ్గినా.., దీర్ఘకాలంలో ప్రయోజనాలు పెరిగాయి. ముఖ్యంగా 6 నుంచి 12 నెలల వ్యవధిలో సిస్టోలిక్ రక్తపోటును దాదాపు 6.1 mmHg వరకు తగ్గించి, బిపి నియంత్రణకు ఇది ఉత్తమ మార్గంగా నిలిచింది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డయాస్టోలిక్ బిపిని స్వల్పకాలంలో తగ్గించడంలో మరియు ఒక ఏడాది వరకు బరువు తగ్గించడంలో సహాయపడింది. అయితే 12 నెలల తర్వాత ఈ ఫలితాలు నిలకడగా కొనసాగలేదు.

'ఊబకాయం, దానికి సంబంధించిన ఇతర వ్యాధుల భారాన్ని తగ్గించడానికి సమగ్ర విధానం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు ఇవన్నీ విడివిడిగా పనిచేసినప్పటికీ, వీటి కలయిక మాత్రమే సుదీర్ఘమైన, విస్తృతమైన ప్రయోజనాలను ఇస్తుంది. పెరుగుతున్న ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ వంటి దేశాలకు ఈ తరహా స్థిరమైన విధానాలు ఎంతో అవసరం.' అని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు.

అయితే ఈ అధ్యయనంలో ఎక్కువ భాగం సమాచారం హై, అప్పర్ మిడిల్ ఇన్‌కమ్‌ దేశాల నుంచే సేకరించింది. భారత్ వంటి లోయర్ మిడిల్ ఇన్‌కమ్ దేశాల భాగస్వామ్యం తక్కువగా ఉందని శాస్త్రవేత్త మహేష్ కుమార్ ముమ్మడి తెలిపారు. అందువల్ల మన స్థానిక పరిస్థితులకు తగినట్లుగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More