రాజ్యాంగాన్ని అణగదొక్కడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి : కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ రాజ్యాంగాన్ని అణగదొక్కుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రతీ వర్గం అన్యాయాన్ని ఎదుర్కొంటుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రాజ్యాంగాన్ని పదే పదే అణగదొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు . రాజ్యాంగ ఉల్లంఘనలకు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ సమానంగా బాధ్యత వహించాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ సమావేశంలో రాహుల్ గాంధీ విడుదల చేసిన న్యాయ పత్రం.. అన్యాయపు పత్రంగా మారిందని విమర్శించారు.

రాహుల్ గాంధీతో ఆ ఎమ్మెల్యేలు
'కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు రాహుల్ గాంధీతో వేదికను పంచుకుంటున్నారు. ఆయన ఒకప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో రాజ్యాంగ నిబంధనలు క్రమంగా దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయి.' అని కేటీఆర్ అన్నారు.
కోదాడలో కస్టడీ మరణం!
కాంగ్రెస్ పాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సహా సమాజంలోని ప్రతి వర్గం అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. కోదాడలో కర్ల రాజేష్ కస్టడీలో మరణించారని ఆరోపించారు కేటీఆర్. తీవ్ర అన్యాయాన్ని బయటపెట్టిన ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వహించారని అన్నారు. జర్నలిస్టులను కూడా ఉగ్రవాదులలాగా చూస్తున్నారని, అరెస్టు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
చర్యలు ఎందుకు లేవు?
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రెండూ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక ఉల్లంఘనలను నివేదించినప్పటికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.
బలమైన రాజ్యాంగం కూడా దానిని అమలు చేసే వారిపై ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ చేసిన హెచ్చరికను కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలోని పరిస్థితి ఆ ఆందోళన ప్రతిబింబిస్తుందని అన్నారు. దేశంలో పెరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ఎత్తిచూపుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక నాటకాన్ని ప్రదర్శించినందుకు వారిని అభినందించారు.
గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్
సింగరేణి అంశంపై మంగళవార బీఆర్ఎస్ పార్టీ.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజధనాన్ని యథేచ్ఛగా లూజీ చేస్తోందని, ఈ భారీ కుంభకోణంపై విచారణ జరిపించాలని, బాధ్యులతై చర్యలు తీసుకోవాలి కేటీఆర్ నాయకత్వంలో గవర్నర్‌ను కలవాలని పార్టీ నిర్ణయించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


