...
...
Next Story

TG Muncipal Election Results : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు - మెజార్టీ స్థానాల్లో పాగా..! ఫలితాలు ఇలా….

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పాగా వేసింది .ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

Published on: Feb 13, 2026, 11:51:39 IST
Advertisement

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా… ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఇందులో కొన్నిచోట్ల కాంగ్రెస్ కు ఆధిక్యం రాగా… మరికొన్నిచోట్ల బీఆర్ఎస్, బీజేపీలకు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో…. కాంగ్రెస్ పార్టీ పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల పాగా వేసింది.

కాంగ్రెస్ హవా…!

కాంగ్రెస్
కాంగ్రెస్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో అతి తక్కువ స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది.

ఇక మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ, డోర్నకల్ మునిప్రాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీతో పాటు మధిర మున్సిపాలిటీపై కూడా హస్తం జెండా ఎగిరింది. హుస్నాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు.

మరోవైపు కొన్నిచోట్ల బీఆర్ఎస్ కూడా విజయం సాధించింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీని ఖాతాలో వేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారం, గుమ్మడిదల, గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటిలపై కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీని తన ఖాతాలోకి వేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

బోణీ తెరిచిన జనసేన…

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన కూడా బోణీ తెరిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 300కిపైగా స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది.

ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున… శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజేతలు తమ సంబరాల కోసం మరో రోజును కేటాయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks