Exit Poll : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నాయి. హస్తం పార్టీనే ఎక్కువ శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకుంటుదని చెబుతున్నాయి.

Published on: Feb 11, 2026, 18:31:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపాలిటీలపై జెండా ఎగరవేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఎలాగైనా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు చివరి నిమిషం వరకూ ప్రచారంతో హీటెక్కించారు. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా

  • మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు
  • కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.
  • నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో కింగ్ మేకర్ కానున్న ఎంఐఎం పార్టీ.
  • ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవు.
  • రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
  • మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
  • కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం.
  • మహబుబ్‌నగర్‌లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
  • నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం.
  • నిజమాబాద్‌లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలిచే అవకాశం.
  • కరీంనగర్‌లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ఖాతాలోకి మున్సిపాలిటీలు!

68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది. 8 నుంచి 14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సంస్థ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

గమనిక : ఈ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా పీపుల్స్ పల్స్ సంస్థ చేసిన సర్వే ఆధారంగా అందించాం. ఎగ్జిట్ పోల్స్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More