...
...
Next Story

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : భారీ ఆధిక్యంతో కాంగ్రెస్ ఘన విజయం - మెజార్టీ ఎంతంటే..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకుపైగా ఓట్ల తేడాతో భారీ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ గెలవటంతో ఆ పార్టీ నేతలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈసీ అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Published on: Nov 14, 2025, 13:13:50 IST
Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో భారీ విక్టరీని నమోదు చేశారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్

ఈ ఉపఎన్నిక ఫలితంపై ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. గెలుపొందిన అభ్యర్థికి ధ్రువీకరణపత్రం అందజేయనుంది. నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఆయన అనుచరులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ కు 98,988(50.83%) పోలవగా… బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259(38.13%) ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డికి డిపాజిట్ దక్కలేదు. కేవలం ఆయనకు 17,061(8.76%) ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ఖి మాగంటి గోపినాథ్ 16,337 ఓట్ల తేడాతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజహరుద్దీన్ కు 64,212 ఓట్లురాగా.. బీజేపీ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 35.03 శాతం ఓట్లు రాగా… ఈసారి జరిగిన ఉపఎన్నికలో 50 శాతం ఓట్లు దక్కాయి. ఈ విక్టరీతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకున్నట్లు అయింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe