...
...
Next Story

Medaram Maha Jathara : గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు - మేడారంలో భక్తజన సందోహం

మేడారంలోని గద్దెలపై వనదేవతలు కొలువుదీరారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతరలో అత్యంత కీలక ఘట్టం పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపై వనదేవతలు కొలువుదీరగా…. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Published on: Jan 30, 2026, 12:11:33 IST
Advertisement

మేడారం జాతర అత్యంత వైభవంగా సాగుతోంది. జాతరలో అత్యంత కీలమైన వనదేవతల రాక పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపై వనదేవతలు కొలువుదీరారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో అత్యంత కీలక ఘట్టం పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపైన ఉన్న వనదేవతలను భక్తులు భారీగా దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మేడారం
మేడారం

గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ ఆధ్వర్యంలో చిలుకల గుట్ట పైకి చేరుకొని సమ్మక్క తల్లికి దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర మంత్రులు అనసూయ(సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివకర టి. ఎస్, జిల్లా ఎస్. పి సుధీర్ రాంనత్ కేకన్ గిరిజన సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మూడంచెల భద్రత మధ్య గన్ ఫైరింగ్ తో చిలకలగుట్టలో రాత్రి 6.55 గంటలకు మేడారంకు సమ్మక్క తల్లి బయలుదేరి మేడారం గద్దెలపైకి చేరుకుంది.

అశేష భక్తజనం….

దీంతో మేడారం మహా జాతరలో ప్రధానఘట్టం ఆవిష్కృతం అవ్వడంతో భక్తులు పులకించిపోయారు. చిలకల గుట్ట నుంచి ఆలయ ప్రాంగణం వరకు అశేష భక్తజనం సమ్మక్క తల్లికి నీరాజనాలు పలికారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లిని గద్దెపై పూజారులు ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు మేడారం గద్దెలపై కొలువు తీరాయి.

మేడారం జాతర లైవ్ ఇక్కడ చూడండి…..

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe