...
...
Next Story

Video : డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి న్యూరో సర్జన్ సజీవ దహనం

Hyderabad-Khammam : హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ డాక్టర్ సజీవ దహనం అయ్యారు.

Updated on: Sep 20, 2026, 19:18:45 IST
Advertisement

హైదరాబాద్-ఖమ్మం రహదారిపై పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మృతుడు ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో పనిచేస్తున్న న్యూరో సర్జన్ జగదీష్ (50) అని, ఆయన ఖమ్మం జిల్లా వైరాకు చెందినవారని గుర్తించారు. తన కుటుంబాన్ని కలిసేందుకు ఆయన హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత కారులో మంటలు చెలరేగి, పూర్తిగా కాలిపోయింది.

హైదరాబాద్-ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం
హైదరాబాద్-ఖమ్మం రహదారిపై రోడ్డు ప్రమాదం

రోడ్డు డివైడర్ ఇనుప గ్రిల్స్‌ను ఢీకొట్టిన తర్వాత న్యూరో సర్జన్ జగదీష్ కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో జగదీష్ కారులో ఒక్కరే ఉన్నారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ నివేదించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

అయితే మంటలను ఆర్పే సమయానికి వాహనం పూర్తిగా కాలిపోయింది. 'తరువాత, డ్రైవర్ సీటులో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. సమీపంలోని టోల్ గేట్ సమాచారం, వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా, మృతుడిని ఖమ్మం జిల్లాలోని ఆసుపత్రిలో పనిచేస్తున్న న్యూరో సర్జన్ కె.జగదీష్‌గా గుర్తించారు.' అని ఒక అధికారి తెలిపారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోంది. నిద్రలేమి కారణంగా డాక్టర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చ అని చెబుతున్నారు.

నిద్రలేమి కారణంగానే డాక్టర్ కారుపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు ఖమ్మం రూరల్ సీఐ జి. రాజశేఖర్ వెల్లడించారు. ప్రారంభంలో బాధితుడిని గుర్తించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే టోల్ గేట్ సమాచారం ఆధారంగా.. చివరకు మృతుడిని మమత ఆసుపత్రిలో న్యూరోసర్జరీ విభాగం అధిపతిగా పనిచేస్తున్న జగదీష్‌గా గుర్తించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks