హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎటువంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా విదేశాలకు తరలిస్తున్న సుమారు రూ. 1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని జప్తు చేయడమే కాకుండా… ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసినట్లు డీఆర్ఏ అధికారులు వెల్లడించారు.
పక్కా సమాచారంతో సోదాలు…

డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులకు అందిన స్పష్టమైన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. అక్టోబర్ 22న హైదరాబాద్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ పురుష ప్రయాణికుడిని అనుమానంతో అడ్డుకున్నారు. అతడి వద్ద ఉన్న క్యాబిన్ బ్యాగేజీని సమగ్రంగా సోదా చేయగా అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ట్రాలీ బ్యాగ్‌లోని బట్టల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లో దాచిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అమెరికన్ డాలర్లు, మలేషియన్ రింగ్గిట్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ. 63.62 లక్షలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
సదరు ప్రయాణికుడిని అధికారులు ప్రాథమికంగా ప్రశ్నించిన సమయంలో మరో కీలక విషయం బయటపడింది. తనతో పాటు ఒక మహిళా ప్రయాణికురాలు కూడా అదే విమానంలో, అయితే వేరొక ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (PNR) నంబర్‌పై ప్రయాణిస్తున్నట్లు అతడు అంగీకరించాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన డీఆర్ఐ బృందం విమానాశ్రయంలో ఆ మహిళపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. కొద్దిసేపట్లోనే ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్‌ను తనిఖీ చేయగా, మొదటి ప్రయాణికుడి తరహాలోనే బట్టల నడుమ నల్లటి ప్లాస్టిక్ కవర్లో దాచి ఉంచిన 97,600 అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి. దీని విలువ భారతీయ రూపాయిల్లో దాదాపు రూ. 91.94 లక్షలుగా ఉంది.
ఈ భారీ మొత్తంలో ఉన్న విదేశీ కరెన్సీని ఎక్కడి నుంచి సంపాదించారు…? దీనిని విదేశాలకు తీసుకువెళ్లడానికి తగిన చట్టబద్ధమైన ఆధారాలు లేదా అనుమతులు ఉన్నాయా? అని అధికారులు వారిని ప్రశ్నించారు. అయితే, ఆ విదేశీ ధనాన్ని చట్టబద్ధంగా పొందినట్లు గానీ, రవాణా చేయడానికి అనుమతి ఉన్నట్లు గానీ ఎలాంటి పత్రాలను ఆ ఇద్దరు ప్రయాణికులు చూపించలేకపోయారు. ఈ విదేశీ కరెన్సీ అక్రమ రవాణా నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో అధికారులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.
{{/usCountry}}ఈ భారీ మొత్తంలో ఉన్న విదేశీ కరెన్సీని ఎక్కడి నుంచి సంపాదించారు…? దీనిని విదేశాలకు తీసుకువెళ్లడానికి తగిన చట్టబద్ధమైన ఆధారాలు లేదా అనుమతులు ఉన్నాయా? అని అధికారులు వారిని ప్రశ్నించారు. అయితే, ఆ విదేశీ ధనాన్ని చట్టబద్ధంగా పొందినట్లు గానీ, రవాణా చేయడానికి అనుమతి ఉన్నట్లు గానీ ఎలాంటి పత్రాలను ఆ ఇద్దరు ప్రయాణికులు చూపించలేకపోయారు. ఈ విదేశీ కరెన్సీ అక్రమ రవాణా నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో అధికారులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.
{{/usCountry}}