...
...
Next Story

తెలంగాణలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి : కల్వకుంట్ల కవిత డిమాండ్

తెలంగాణలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఎక్కువగా పడిపోయాయని చెప్పారు.

Published on: Oct 4, 2026, 17:09:15 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు తాండవిస్తోందని, భూగర్భ జలాలు విపరీతంగా పడిపోయి రైతాంగం తీవ్ర అల్లాడుతోందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులకు మద్దతుగా ప్రభుత్వం తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టి కరువు మండలాలను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

ప్రస్తుత తీవ్ర వాతావరణ పరిణామాలపై స్పందిస్తూ, ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం దారుణంగా పడిపోయిందని కవిత వివరించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు దాదాపు 20 అడుగులకు పైగా లోతుకు పడిపోయాయని, ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎల్‌నినో తీవ్ర ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు చర్యలు తీసుకోలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలోనైనా కరువు మండలాలను ప్రకటిస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిందని, కరువు ప్రకటించి ఉంటే కేంద్రం నుండి రైతులకు సహాయంందేదని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ రంగానికి కరెంట్ సరఫరా సరిగా లేదని కవిత రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సాగునీటి కోసం రైతులకు రోజుకు ఆరు నుండి ఏడు గంటలకు మించి విద్యుత్ అందడం లేదని మండిపడ్డారు. కరెంట్ కోతలు లేవని నిరూపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి రావడానికైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఉచిత, నిరంతర విద్యుత్ అందించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

'రేవంత్ రెడ్డి మన నీళ్లను గిప్ట్ ప్యాక్ చేసి చంద్రబాబుకు పంపిస్తున్నాడు. కృష్ణ నీళ్లు కుప్పం వెళ్తాయి కానీ మన మహబూబ్​నగర్ రైతులకు మాత్రం రావు. నార్లపూర్ రిజర్వాయర్‌కు కొంత ఖర్చు చేసి ఉంటే ఇప్పుడు దానిని నింపుకొనే అవకాశం ఉండేది. గ్రౌండ్ వాటర్ పెరిగేది.. కల్వకుర్తి పూర్తి ఆయకట్టుకైనా ఆ నీళ్లు ఉపయోగపడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో ఏ ఒక్క పని చేయకపోవడంతో ఈ రోజు కరువుతో అల్లాడల్సిన పరిస్థితి వచ్చింది.' అని కవిత అన్నారు.

కేవలం వ్యవసాయానికే కాకుండా హైదరాబాద్ సహా పలు ప్రధాన పట్టణాల్లో తాగునీటి కొరత ఏర్పడుతోందని కవిత చెప్పారు. రాష్ట్రంలోని 60 నియోజకవర్గాల్లో తమ పార్టీ ఇన్ఛార్జ్‌లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు, రైతులకు అండగా ఉంటారని, మిగతా ప్రాంతాల్లోనూ బాధితులకు తెలంగాణ రక్షణ సేన పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks