తెలంగాణ వ్యాప్తంగా విపరీతమైన చలి ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ గజ గజ వణికిపోతుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల సమయాలను సవరించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తరగతులు ఉదయం ఆలస్యంగా ప్రారంభమవుతాయి. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

చలి వాతావరణం కారణంగా విద్యార్థుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి ఉదయం 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు కాకుండా ఉదయం 9.40 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలు సమయాలను తక్షణమే పాటించాలని ఆదేశించారు. సూచనలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించనున్నట్టుగా తెలిపారు.
కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలోని కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. భీమ్పూర్ మండలంలోని అర్లి (T) గ్రామంలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 7.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. డిసెంబర్ 11న ఇది 5.4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. ఇంత చలిలో ఉదయంపూట పాఠశాలలకు త్వరగా వెళ్లాలంటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరో నాలుగు రోజులు
తెలంగాణలో చలిగాలులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి, అనేక ప్రాంతాల్లో సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ అత్యంత శీతల ప్రాంతంగా మారింది. డిసెంబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శీతల గాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా ఆసిఫాబాద్ అత్యంత శీతల ప్రదేశంగా ఉంది. ఇక్కడ 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. తరువాత సంగారెడ్డి (6.4 డిగ్రీలు), రంగారెడ్డి (6.5 డిగ్రీలు) ఉన్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఇతర జిల్లాలు ఆదిలాబాద్ (7.7 డిగ్రీలు), వికారాబాద్, సిద్దిపేట (8.1 డిగ్రీలు), మెదక్ (8.5డిగ్రీలు), కామారెడ్డి (8.6డిగ్రీలు), నిజామాబాద్ (9.1 డిగ్రీల).
{{/usCountry}}తెలంగాణ వ్యాప్తంగా ఆసిఫాబాద్ అత్యంత శీతల ప్రదేశంగా ఉంది. ఇక్కడ 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. తరువాత సంగారెడ్డి (6.4 డిగ్రీలు), రంగారెడ్డి (6.5 డిగ్రీలు) ఉన్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఇతర జిల్లాలు ఆదిలాబాద్ (7.7 డిగ్రీలు), వికారాబాద్, సిద్దిపేట (8.1 డిగ్రీలు), మెదక్ (8.5డిగ్రీలు), కామారెడ్డి (8.6డిగ్రీలు), నిజామాబాద్ (9.1 డిగ్రీల).
{{/usCountry}}ఈ రాత్రి నుండి చలిగాలులు మరింత తీవ్రమవుతాయని, ఉత్తర, పశ్చిమ తెలంగాణ అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు 5-7 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే 24-48 గంటల్లో హైదరాబాద్‌లో 7 నుంచి 9 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.