రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. మొత్తం 12 రైళ్లు పలు తేదీల్లో రద్దయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
రద్దు చేసిన రైళ్ల వివరాలు :

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్లే ( నంబర్ 67781)ను ఏప్రిల్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు.
- మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకు నడిచే రైలు (నంబర్ 67782)ను ఏప్రిల్ 11 నుంచి 19వ తేదీ వరకు రద్దు చేశారు.
- కాచిగూడ నుంచి రాయచూర్ కు వెళ్లే రైలు (నంబర్ 67787)ను ఏప్రిల్ 11 నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు.
- రాయచూర్ నుంచి కాచిగూడకు ప్రయాణించే రైలు (నంబర్ 67788)ను ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు.
- గుంతకల్లు - బోధన్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 57411) ట్రైన్ ను ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18 వరకు రద్దు చేశారు.
- కాచిగూడ - గుంతకల్లు (57412) మధ్య నడిచే ట్రైన్ ను ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు రద్దు చేశారు.
- కాచిగూడ - కర్నూల్ సిటీ మధ్య నడిచే (నెంబర్ 17435) రైలును.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు రద్దు చేశారు.
- కర్నూల్ సిటీ నుంచి కాచిగూడ మధ్య నడిచే(17436) రైలును ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు రద్దు చేశారు.
- కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే (77641) రైలును ఏప్రిల్ 11 నుంచి 18వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు.
- మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ మధ్య నడిచే (77641) ట్రైన్ ను ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు రద్దు చేశారు.
మహబూబ్ నగర్ - మన్యంకొండ స్టేషన్ల మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి... టికెట్లను బుకింగ్ చేసుకోవాలని కోరింది.
{{/usCountry}}మహబూబ్ నగర్ - మన్యంకొండ స్టేషన్ల మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి... టికెట్లను బుకింగ్ చేసుకోవాలని కోరింది.
{{/usCountry}}