హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు, స్కూళ్లకు సెలవు!
హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానికంగా జనాలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు విద్యాసంస్థలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలో భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు పేర్కొన్నారు. మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు ప్రాంతాల్లో ఉదయం స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇది భూకంపమేనా? లేదంటే ఇతర పేలుళ్ల కారణంగా భూ ప్రకంపనలు సంభవించాయా? తెలియాల్సి ఉంది.

గాజులరామారంలోని మెట్ కాన్ గూడ నివాసితులు మంగళవారం కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలను అనుభవించారు. ఇది పరిసర ప్రాంతాలలో భయాందోళనలను రేకెత్తించింది. ఆకస్మికంగా భూమి కంపించినట్టుగా అనిపించడంతో భయపడ్డ చాలా మంది జనాలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. పొరుగువారిని ఏం జరిగిందని అడగుతూ భయపడ్డారు. భూ ప్రకంపనల ప్రభావం అనేక శివారు ప్రాంతాలలో ఉందని, భూమి కొద్దిసేపు కంపించిదని మరికొందరు చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్‌లోని మెట్ కాన్ గూడ ప్రాంతంతో సహా పలు ప్రాంతాల్లో భూకంప కార్యకలాపాలు నమోదయ్యాయి. ఉదయం 10:10 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా మంది భయపడ్డారు.
పెద్ద శబ్దంతో భూమి కంపించిందని, ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో నివాసితులలో ఆందోళన మరింత పెరిగింది. ఈ సంఘటన కొన్ని సేకన్లపాటు జరిగింది. ఇంట్లోని వస్తువులు కదిలాయని, కుటుంబాలు వెంటనే బయటకు పరుగులు తీశాయని స్థానికులు తెలిపారు. భూకంపం వల్ల సంభవించిందా లేక ఏదైనా పేలుడు వల్ల సంభవించిందా? అనే దానిపై తెలియాల్సి ఉంది. భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని స్థానికులు చెబుతున్నారు. పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నుండి భయంతో బయటికి పరుగులు తీశామని చెప్పారు. భూకంపం సంభవించినట్లు మాత్రం అధికారులు కన్ఫామ్ చేయలేదు.
పాఠశాలలకు సెలవులు
ఈ సంఘటన తర్వాత సమీపంలోని విద్యా సంస్థల యాజమాన్యాలు ముందుజాగ్రత్తలో బాగంగా సెలవు ప్రకటించాయి. అయితే ఈ సంఘటన గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. నివాసితులు అందించిన సమాచారం ఆధారంగా, అధికారులు మెట్ కాన్ గూడకు చేరుకుని అధ్యయనాన్ని ప్రారంభించారు. ఆకస్మిక ప్రకంపనలకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


