ECIL Recruitment : హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 310 అప్రెంటిస్ పోస్టులు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు
హైదరాబాద్ ఈసీఐఎల్ లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోని 'ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ECIL) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం 2026-27 సంవత్సరానికి గాను 310 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ఈసీఐఎల్ హైదరాబాద్ యూనిట్‌లో శిక్షణ ఇస్తారు.

ఈ ప్రకటన ద్వారా మొత్తం 13 రకాల ఐటీఐ ట్రేడులలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రేడ్ వారీగా ఖాళీల వివరాలు చూస్తే…
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 86 పోస్టులు
- ఫిట్టర్: 87 పోస్టులు
- ఎలక్ట్రీషియన్: 50 పోస్టులు
- కోపా (COPA): 41 పోస్టులు
- వెల్డర్: 16 పోస్టులు
- టర్నర్: 8 పోస్టులు
- మషినిస్ట్: 7 పోస్టులు
- ఆర్ అండ్ ఏసీ మెకానిక్: 5 పోస్టులు
- కార్పెంటర్, ప్లంబర్, డీజిల్ మెకానిక్, పెయింటర్, మషినిస్ట్ (జి): ఒక్కో విభాగానికి 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
మొత్తం 310 ఖాళీలలో జనరల్ కేటగిరీకి 125, ఓబీసీలకు 84, ఎస్సీలకు 47, ఎస్టీలకు 23, ఈడబ్ల్యూఎస్ వర్గానికి 31 సీట్లు కేటాయించారు. దివ్యాంగులకు (PWD) 16 సీట్ల ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.
సంబంధిత ట్రేడ్‌లో NCVT సర్టిఫికేట్‌తో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు 31.10.2026 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు కాగా, ఓబీసీలకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లుగా నిర్ణయించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా 10 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం సీట్లలో 70 శాతం ప్రభుత్వ ఐటీఐ కళాశాలల విద్యార్థులకు, 30 శాతం ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు. ఎటువంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఉండవు. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఈ-మెయిల్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమాచారం పంపుతారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట అప్రెంటిస్‌షిప్ పోర్టల్ www.apprenticeshipindia.gov.in లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in లోకి వెళ్లి 'Human Resources' -> 'Current Job Openings' ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 30, 2026 (సాయంత్రం 6 గంటల నుంచి)
- దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2026 (రాత్రి 11:59 వరకు)
- సర్టిఫికెట్ల పరిశీలన: అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 24, 2026 వరకు
- శిక్షణ ప్రారంభం: నవంబర్ 02, 2026 శిక్షణ కాలపరిమితి సరిగ్గా ఒక సంవత్సరం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

